సోనియామ్మా.. అంతా ద్వేషం ఎందుకమ్మా?
ఇంతకీ ఇదంతా ఇప్పుడు ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చింది అని అంటారరా... ఇటీవలే సోనియాగాంధీ వ్యవహరించిన తీరు చూస్తే హాట్ టాపిక్ గా మారిపోయింది. ఎప్పుడు బిజెపి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తుంది అంటూ ప్రజాస్వామ్యంలోనే పలు విషయాలను తెరమీదికి తీస్తుంటుంది కాంగ్రెస్.. కానీ అలాంటి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మాత్రం రాజకీయ ద్వేషంతో ముందుకు సాగుతున్నారు అనే విషయాన్ని ఇటీవల బీజేపీ నేత తెలిపారు. బిజెపి నేత పరేశ్ రావల్ ఇచ్చిన స్టేట్మెంట్ కాస్త ప్రస్తుతం వైరల్ గా మారిపోయింది.
బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత రామ్నాథ్ కోవింద్ గారిని రాష్ట్రపతిని చేశారు అన్న కారణంతో ఇప్పటివరకు సోనియాగాంధీ ఒక్కసారి కూడా రామ్నాథ్ కోవింద్ తో సమావేశం కాలేదు. అంతేకాకుండా ప్రధాని మోదీ హయాంలోనే సైనికుల త్యాగాలకు గుర్తుగా వార్ మెమోరియల్ నిర్మించగా.. ఇప్పటివరకు సోనియాగాంధీ వార్ మెమోరియల్ దగ్గరికి వెళ్ళింది లేదు సందర్శించింది లేదు. అంతేకాకుండా ఇక స్టాచ్యూ ఆఫ్ యూనిటీ పేరుతో ఏకంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని స్థాపించింది బిజెపి ప్రభుత్వం. అయితే ఇప్పటివరకు సోనియాగాంధీ సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని చూడడానికి వెళ్లలేదు. ఇలాగే కొనసాగితే కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు కూడా సోనియాగాంధీ వెళ్లొద్దని అని అనుకుంటే ఇక సోనియాగాంధీ పార్లమెంటుకు వెళ్లకుండా ఊరుకుంటారా ప్రశ్నిస్తున్నారు విశ్లేషకులు.