కరోనా టైమ్ లో.. ఎన్ని దేశాల ఆరోగ్య శాఖ మంత్రులు రాజీనామా చేశారో తెలుసా?
ఈ క్రమంలోనే ఇక కరోనా వైరస్ క్లిష్ట ఈ పరిస్థితుల్లో వైరస్ నియంత్రణకు సరిగ్గా చర్యలు తీసుకోలేక ఎంతోమంది ఆరోగ్య శాఖ మంత్రులు ఏకంగా మంత్రి పదవి నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. కేవలం 2021 సంవత్సరం లోనే.. పలు దేశాలకు చెందిన ఆరోగ్య శాఖ మంత్రులు ఇక వైరస్ ను సమర్థవంతంగా ఎదుర్కోలేక చివరికి తన పదవికి రాజీనామా చేశారు. ఎక్వాడోర్ దేశానికి చెందిన ఆరోగ్య శాఖ మంత్రి వ్యాక్సినేషన్ విషయంలో అక్రమాలకు పాల్పడినట్లు తేలడంతో చివరికి ఆయన మంత్రి పదవి నుంచి తొలగించబడ్డారు.
ఆస్ట్రేలియా ఆరోగ్య శాఖ మంత్రి కూడా ఏప్రిల్ 13వ తేదీన తన మంత్రి పదవికి రిజైన్ చేశారు. తాను ఇప్పటికీ కరోనా వైరస్ సంక్షోభం సమయంలో ఎంతో శ్రమించానని అయినప్పటికీ వైరస్ కంట్రోల్లోకి రాలేదని ఇక ఈ మంత్రి పదవికి సరైన వ్యక్తి రావాలని కోరుకుంటున్నాను అంటూ వివరణ ఇచ్చిన ఆయన రాజీనామా చేశారు. ఇరాక్ హెల్త్ మినిస్టర్ కూడా మంత్రి పదవి నుంచి తప్పుకున్నారు. కరోనా ఆస్పత్రిలో ఫైర్ యాక్సిడెంట్ జరిగి 80 మంది ప్రజలు చనిపోయిన తర్వాత దీనికి బాధ్యతగా అయన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ కరుణా సమయాల్లో అర్జెంటీనా హెల్త్ మినిస్టర్ కూడా మంత్రి పదవికి రాజీనామా చేశారు. అటు జోర్డాన్ హెల్త్ మినిస్టర్ కూడా కరోనా సంక్షోభం సమయంలో తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆక్సిజన్ కొరత కారణంగా ఆరు మంది చనిపోయిన తర్వాత దానికి బాధ్యత వహిస్తూ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. అంతేకాకుండా పేరు, స్లోవాకీయ, మంగోలియా లాంటి దేశాల్లో ఆరోగ్య శాఖ మంత్రులు కూడా వివిధ కారణాల దృష్ట్యా కరోనా టైంలో తన మంత్రి పదవికి రాజీనామా చేశారు.