బ్లాక్ ఫంగస్ బయపెడుతుంది.. అచ్చం కరోనా లాగానే?
అయితే ప్రస్తుతం కరోనా వైరస్ నుంచి కోలుకోవడానికి అసలైన మందు కేవలం మనో ధైర్యం మాత్రమే అని తెలుసుకుని ధైర్యంగా ఉన్నారు. ఈ క్రమంలో ఎంతోమంది వైరస్ బారిన పడినప్పటికీ మృత్యువు నుంచి బయట పడుతున్న తరుణంలో... అటు కరోనా మహమ్మారి పోయింది అనుకుంటే ఇక బ్లాక్ ఫంగస్ అనే మహమ్మారి ప్రాణాలు తీసేందుకు సిద్ధమవుతోంది. రోజురోజుకు దేశంలో బ్లాక్ ఫంగస్ కేసుల సంఖ్య పెరిగిపోతుండటం చూస్తూ ఉంటే ప్రజలందరిలో ప్రాణభయం నెలకొంది. ముఖ్యంగా అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్నట్లు తెలుస్తుంది.
మొన్నటి వరకు అతి తక్కువ కేసులు ఉన్న రాష్ట్రంగా ఉన్న ఏపీ లో చూస్తూ చూస్తూ ఉండగానే కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోయింది. పాక్షిక లాక్ డౌన్ కారణంగా ప్రస్తుతం కరోనా వైరస్ కేసులు కాస్త అదుపులోకి వస్తున్నాయని అనుకుంటున్న తరుణంలో బ్లాక్ ఫంగస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే బ్లాక్ ఫంగస్ కేసుల సంఖ్య.. 1179 కి చేరింది. ఇందులో 1139 మందికి కరోనా వచ్చి తగ్గిన తర్వాత బ్లాక్ ఫంగస్ వచ్చినట్లు వైద్యులు గుర్తించారు. కరోనా వైరస్ రాకపోయినప్పటికీ రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలో కూడా బ్లాక్ ఫంగస్ వస్తున్నట్లు వైద్యులు గుర్తించినట్లు తెలిపారు. అంతేకాదు 45 ఏళ్లు దాటిన వారిలో అధికంగా బ్లాక్ ఫంగస్ కేసులు వెలుగులోకి వస్తున్నట్లు తెలిపారు ఇలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా తగ్గుతుందని సంతోష పడుతున్న జనాలకు బ్లాక్ ఫంగస్ ఆందోళన కలిగిస్తుంది.