హీరో అత్త పాత్రలో అనుష్క.. షాకవుతున్న అభిమానులు?
ఇక అప్పటికే ఈ అమ్మడికి అవకాశాలు తగ్గిపోవడం.. అంతలోనే యువ హీరోయిన్లు తెర మీదికి రావడం.. తమ అందాలతో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడం.. ఇలా అన్నీ జరిగిపోయాయి.. ఇక ఈ అమ్మడికి సీనియర్ హీరోయిన్ ముద్రపడిపోయింది. దీంతో తెలుగు చిత్ర పరిశ్రమలో అవకాశాలు తగ్గిపోయాయి. లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ముందులా మళ్లీ కెరీర్ని ఫామ్లోకి మాత్రం తీసుకురాలేక పోతుంది అనుష్క. ఇక ఇప్పుడు అనుష్క గురించి ఒక ఆసక్తికర వార్త టాలీవుడ్ టౌన్ లో వైరల్ గా మారిపోయింది.
మొన్నటి యువ హీరోలు, సీనియర్ హీరోల సరసన హీరోయిన్గా నటించి తన అందం అభినయంతో ఆకట్టుకున్న అనుష్క.. మరికొన్ని రోజుల్లో ఏకంగా ఒక హీరోకి అత్త పాత్రలో నటించబోతున్నట్లు ప్రస్తుతం టాలీవుడ్ కోడై కూస్తోంది. దీనికి సంబంధించి త్వరలోనే అనుష్క నుంచి అధికారిక ప్రకటన రాబోతున్నట్టు సమాచారం. ఇక ఈ అత్త పాత్రకు సంబంధించి లుక్ ని కూడా త్వరలోనే విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో అలరిస్తున్న అనుష్క మరికొన్ని రోజుల్లో హీరోయిన్గా అవకాశాలు దక్కించుకుంటుందని అభిమానులు భావిస్తుంటే.. ఇక ఇప్పుడు అత్త పాత్రలో నటించబోతోందని టాక్ వినిపిస్తుండటంతో అభిమానులు షాక్ అవుతున్నారు.