DRDO అద్భుత ఆవిష్కరణ?

praveen
గత కొన్ని రోజుల నుంచి డిఆర్డిఓ ప్రతి విషయంలో ఎంతో వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్న తీరు ప్రపంచ దేశాలకు సైతం ఆదర్శంగా నిలుస్తోంది.  ఒకప్పుడు డిఆర్డిఓ ఉన్నప్పటికీ.. ఆయుధాల కోసం భారత్ ఎక్కువగా విదేశాలపై ఆధారపడి ఉండేది. కానీ ఎప్పుడైతే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి అటు డి ఆర్ డి ఓ కి పూర్తిస్థాయి ప్రోత్సాహం తో పాటు కావాల్సిన నిధులను సమకూరుతున్నాయి. ఈ క్రమంలోనే ఇక శరవేగంగా ఆయుధాలను  తయారు చేయడంలో డిఆర్డివో నిమగ్నమై పోతుంది. ఈ క్రమంలోనే ఇతర దేశాల నుంచి ఆయుధాలు కొనుగోలు చేయడం కాదు.. ఇతర దేశాలకు ఆయుధాలను విక్రయించే స్థాయికి డిఆర్డిఓ దూసుకొచ్చింది.



 రోజురోజుకు సరికొత్త టెక్నాలజీతో కూడిన ఆయుధాలను అభివృద్ధి చేసి వాటికి ప్రయోగాలు నిర్వహించి విజయవంతం అవుతూ ప్రపంచ దేశాల చూపును సైతం ఆకర్షిస్తుంది భారత్. అదే సమయంలో ఇక ప్రపంచదేశాలకు పోటీగా ఆయుధ విక్రయాలను కూడా ప్రారంభించి.. మరింత  వ్యూహాత్మకంగా దూసుకుపోతుంది. ఇక ఇప్పుడు మరో అద్భుత ఆవిష్కరణ కు  శ్రీకారం చుట్టింది భారత రక్షణ పరిశోధన సంస్థ. ఇప్పుడు వరకు డిఆర్డిఓ ఎన్నో రకాల యుద్ధ విమానాలను తయారు చేసినప్పటికీ ఇంజన్ల విషయంలో మాత్రం ఇతర దేశాల పైన ఆధార పడుతూ వచ్చింది.



 ఇటీవలే డిఆర్డిఓ ప్రత్యేకమైన 2000 mt ఐసోథర్మల్  ఫోర్స్ ప్రెస్ ను ఉపయోగించి ఎంతో కష్టతరమైన టైటానియం మిశ్రమం నుండి అధిక పీడన కంప్రెషర్ కలిగిన డిస్కుల యొక్క ఐదు దశలను ఉత్పత్తి చేయడానికి ఐసోథర్మల్ ఫోర్స్ టెక్నాలజీ ని ఏర్పాటు చేసింది.  ఇది ఏరో ఇంజిన్ తయారీ కోసం ఎంతో కీలకంగా ఉపయోగపడనుంది. ఇక ప్రస్తుతం డిఆర్డిఓ ఈ అద్భుతమైన  ఆవిష్కరణతో ప్రస్తుతం ఏరో ఇంజన్ భాగాల తయారీ సామర్ధ్యాలను కలిగి ఉన్న దేశాల జాబితాలో చేరిపోయింది. డిఆర్డిఓ ఆవిష్కరణల్లో ఇది గొప్ప అధ్యాయం అని విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: