కాశ్మీర్ లో సరికొత్త రికార్డ్.. ఇమ్రాన్ కి చెంప పెట్టె?

praveen
కాశ్మీర్ భూభాగంలో ఒకప్పుడు పరిస్థితులు ఎంతో ఆందోళనకరంగా ఉండేవి. ఎప్పుడు ఉగ్రవాదుల దాడులు, మారణహోమాలు జరుగుతూ ఉండేవి. కానీ ఎప్పుడైతే మోడీ ప్రభుత్వం 370 ఆర్టికల్ రద్దు చేసిందో అప్పటినుంచి కాశ్మీర్ ప్రాంతంలో అభివృద్ధి పరుగులు పెడుతుంది. ఉద్యోగ, ఉపాధి కల్పన దిశగా కేంద్రం అడుగులు వేసింది. ఇక ఇప్పుడు మరో సారి కరోనా విషయంలో కాశ్మీర్ లో సరికొత్త రికార్డును నెలకొల్పింది కేంద్ర ప్రభుత్వం.  ఓవైపు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో కనీసం కరోనా కూ సరైన చికిత్స అందించలేక పోతుంది అక్కడి ప్రభుత్వం.  కనీస ఐసోలేషన్ సిస్టమ్ ని కూడా ఏర్పాటు చేయడంలో విఫలమైంది పాకిస్థాన్ ప్రభుత్వం. కానీ అదే సమయంలో అటు భారత్ లోని కాశ్మీర్లో మాత్రం కేంద్ర ప్రభుత్వం ఎంతో సమర్థవంతంగా కరోనా వైరస్ ని ఎదుర్కొనేందుకు చర్యలు చేపడుతుంది.



 కాశ్మీర్ భూభాగంలో భారీ ఎత్తున వ్యాక్సినేషన్ ప్రక్రియ సాగుతుంది.  ఏకంగా కాశ్మీర్ లోని నాలుగు జిల్లాలలో 45 సంవత్సరాలు నిండిన వారందరికీ కూడా 100% వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయినట్లు ఇటీవలే అధికారులు నివేదికలో తెలిపారు. అంతే కాకుండా అక్కడి రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కూడా 50 శాతం నుంచి 70 శాతం వరకు వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయినట్లు తెలుస్తోంది. పూర్తిగా జమ్మూకాశ్మీర్లో  66 శాతం మందికి వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయింది.



 అంతేకాకుండా దేశంలో ఎక్కడా లేని విధంగా ఏకంగా నాలుగు జిల్లాలలో వందశాతం వ్యాక్సినేషన్ ప్రక్రియ కాశ్మీర్లోనే పూర్తి కావడం గమనార్హం. ఇలా 370 ఆర్టికల్ రద్దు అయిన తర్వాత కాశ్మీర్ భూభాగాన్ని అభివృద్ధి చేయడం విషయంలోనే కాదు కరోనా వైరస్ ను కట్టడి చేయడంలో కూడా కాశ్మీర్ కు కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రాముఖ్యత ఇస్తుంది అనే విషయం తెలుస్తుంది.  అయితే ఓ వైపు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో అక్కడి ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుంటే.. మరోవైపు భారత్ లో ఉన్న  కాశ్మీర్ ప్రాంతంలో మాత్రం అక్కడి ప్రజలకు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తూ కరోనా వైరస్ పోరాటంలో మనోధైర్యాన్ని కల్పిస్తుంది కేంద్ర ప్రభుత్వం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: