బ్లాక్ ఫంగస్: ఈ విషయాలు తప్పక గుర్తుంచుకోండి ?
* బ్లాక్ ఫంగస్ అనేది అంటు వ్యాధి కాదు. ఇది ఒకరి నుండి మరొకరికి సోకదు.
* డయాబెటిస్ నియంత్రణలో లేని కరోనా బాధితులు ఎక్కువగా బ్లాక్ ఫంగస్ బారిన పడుతున్నారు.
*చికిత్సల కోసం ఇమ్యునిటీ కంట్రోల్ డ్రగ్స్ ఎక్కువగా వినియోగించిన రోగుల్లో ‘బ్లాక్ ఫంగస్’ కనిపిస్తోంది.
* బ్లాక్ ఫంగస్ లక్షణాలు కళ్లు ఎర్రబడడం, ముఖం వాపు, తిమ్మిరులు, ముఖంపై నొప్పి, కళ్ళు ముక్కు చుట్టు పక్కల భాగంలో ఎర్రబడడం, నాలుకపై లేదా ముక్కుపై నల్ల మచ్చలు, ఒక వైపు దవడ వాయడం, కంటిచూపు మందగించినట్లు అనిపించడం వంటివి లక్షణాలుగా గుర్తించాలి. ఇలాంటివి కనిపిస్తే వెంటనే ఈ ఎన్ టి డాక్టర్ ను సంప్రదించాలి అని చెబుతున్నారు ప్రముఖ వైద్య నిపుణులు.
* తొలి దశలోనే కనుక ఈ లక్షణాలు గుర్తించినట్లయితే చికిత్స చేయవచ్చు అంటున్నారు. అలాగే ఆలస్యమయ్యే కొద్దీ ఈ ప్రమాదం పెరుగుతున్నట్లే అని గుర్తు చేస్తున్నారు.