కరోనా కేసులు తగ్గుముఖం ... !

VAMSI
కరోనా సెకండ్ వేవ్ ప్రపంచంలో తన పంజా విసురుతూ కరాళ నృత్యం చేస్తోంది. ఇక మన దేశంలో కరోనా ఉదృతి గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు పాజిటివ్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. మరణాల సంఖ్య ప్రతి రోజు వేలల్లో నమోదవుతూ ఉండడం తీవ్ర భయాందోళనలు కలిగిస్తోంది. ఓ వైపు లాక్ డౌన్ లు, కరోనా నిబంధన చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ కరోనా ముఖ్యంగా మహారాష్ట్ర , ఢిల్లీ, కర్ణాటక , ఆంధ్ర రాష్ట్రాలలో విలయతాండవం చేస్తూ ప్రజలను తీవ్రంగా బాధిస్తోంది. కనీసం కాస్తయినా ఈ వైరస్ ఉధృతిలో మార్పు వచ్చి తగ్గుముఖం పడితే ఊపిరిపీల్చుకోవాలని తహతహలాడుతున్నారు జనాలు.

ప్రతి రోజు కరోనా వార్తలు చూసి మానసిక ఒత్తిడి పెరిగిపోతోందంటూ చింతిస్తున్నవారెందరో అయితే, ఇలాంటి విపత్కర సమయంలో నేడు కొంతలో కొంత కాస్త ఊరట కలిగే వార్త అందింది.  ఇప్పుడిప్పుడే దేశం కరోనా కాటు నుండి కాస్త బయట పడుతోంది. ఇది నిజంగా సంతోషించాల్సిన విషయం. వైరస్ వ్యాప్తి  క్రమ క్రమంగా తగ్గుముఖం పడుతోంది. కేసుల పరంగా చూస్తే గత వారం నుండి కరోనా కేసుల లెక్కలు నాలుగున్నర లక్షలు తగ్గని నేపథ్యంలో,  ఈ వారంలో చూసుకుంటే మూడున్నర లక్షలు అలా తగ్గుతూ వచ్చింది. దీనితో కొంచెం ఉపశమనం కలిగిందని చెప్పవచ్చు. నిన్నటి లెక్కలు కనుక పరిశీలిస్తే గత 24 గంటల్లో 307423 కేసులు రిజిస్టర్ అయ్యాయి. అదే విధంగా రికవరీ అయిన  వారి సంఖ్య చూస్తే భారీగా పెరిగింది. నమోదు అయిన కేసులు కంటే రికవరీ కేసుల సంఖ్య ఎక్కువగా ఉండటం కాస్త ఊరటనిచ్చింది.


నమోదు అయిన కేసులు 307423 కాగా రికవరీ అయినవారి సంఖ్య 355000. అంటే దాదాపుగా 45000 మంది నమోదయిన కేసుల కంటే అదనగా రికవరీ అయ్యారు.  అయితే మరణాల సంఖ్య మాత్రం గత రెండు రోజులతో పోలిస్తే కాస్త పెరిగింది. గడిచిన ఇరవై నాలుగు గంటల్లో దేశవ్యాప్తంగా 4010 మంది కరోనా భాదితులు మరణించారు. రికవరీలు పెరుగుతూ ఉండటం సంతోషం, అలాగే కేసుల సంఖ్య కూడా తగ్గుముఖం పడుతుండటం ఆనందించదగ్గ విషయం. అయితే మరణాలు సంఖ్య  కూడా తగ్గాల్సి ఉంది. ఇంకా కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడితేకాని ప్రమాదం తగ్గదు. అప్పటి వరకు ఎప్పటిలాగే ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం మరియు భాద్యత మనపై ఉందన్నది అక్షర సత్యం. జాగ్రత్తగా వ్యవహరిద్దాం సురక్షితంగా ఉందాం.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: