ఇజ్రాయిల్ ను రక్షించిన ఐరన్ డోమ్.. ఇప్పుడు భారత్ లోకి?
దీనికంతటికీ కారణం ఇజ్రాయిల్ ఏర్పాటు చేసుకున్న ఐరన్ డోమ్ రక్షణ వ్యవస్థ కారణం. శత్రు దేశాలు ప్రయోగించిన రాకెట్ లు ఏవి కూడా ఈ రక్షణ వ్యవస్థను దాటుకుని లోపలికి రాలేవు. ఐరన్ డోమ్ రక్షణ వ్యవస్థ శత్రుదేశాలు ప్రయోగించిన రాకెట్ ను గుర్తించి వాటిని గాల్లోనే నాశనం చేస్తుంది. అంతే కాకుండా ఇక ఆ రాకెట్ ప్రయోగించే ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాలలో రాకెట్ దాడి చేస్తుంది ఐరన్ డోమ్ వ్యవస్థ. ఇలాంటి అద్భుతమైన రక్షణ వ్యవస్థ కారణంగానే ఇజ్రాయిల్ తీవ్రవాదులు అకస్మాత్తుగా చేసిన దాడి నుంచి కూడా భారీ నష్టం లేకుండా బయటపడ గలిగింది.
అయితే ఇలాంటి గొప్ప రక్షణ వ్యవస్థ ఇప్పుడు భారత్లోకి కూడా వస్తుందా అంటే అవును అనే సమాధానం వినిపిస్తోంది. ఎన్నో ఏళ్ల నుంచి భారత్ ఇజ్రాయిల్ మధ్య ఎంతో బలమైన బంధం కొనసాగుతుంది. ఈ క్రమంలోనే 2017 సంవత్సరం లోనే ఇక ఐరన్ డోమ్ రక్షణ వ్యవస్థను భారత్లో కూడా ఏర్పాటు చేసేందుకు ఇజ్రాయిల్ ఒప్పుకుంది.అయితే ఆ తర్వాత అమెరికా లోని కొంతమంది దీనికి అడ్డుతగలడంతో ఇక దీనికి సంబంధించిన కార్యచరణ ఆగిపోయింది. అయితే ఇక మరికొన్ని రోజుల్లో ప్రస్తుతం ఇజ్రాయిల్ ప్రధానమంత్రిగా ఉన్న నేతన్యాహు పదవీకాలం పూర్తవుతున్న నేపథ్యంలో ఇక అప్పటిలోగా భారత్ కి అద్భుతమైన రక్షణ వ్యవస్థ అయిన ఐరన్ డోమ్ వచ్చే అవకాశం ఉంది అన్నది సమాచారం. ఏం జరుగుతుందో చూడాలి మరి.