మళ్ళీ తోక జాడిస్తున్న చైనా.. రంగలోకి ఇండియన్ ఆర్మీ ఛీప్?

praveen
భారత్-చైనా సరిహద్దు  వద్ద గత కొన్ని రోజుల క్రితం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి  విస్తరణ వాద ధోరణితో ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని ఉద్రిక్తంగా మారుస్తు భారత భూభాగాన్ని ఆక్రమించుకునేందుకు ప్రయత్నించింది చైనా. కానీ భారత ఆర్మీ అప్రమత్తమై దీటుగా ఎదురు నిలబడటంతో చైనా ఆటలు సాగలేదు. ఇక ఎన్నో రోజుల పాటు భారత్ చైనా సరిహద్దు లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇక మరికొన్ని రోజుల్లో యుద్ధం జరుగుతుందేమో అని అనుకుంటున్న తరుణంలో ఇరు దేశాలు ఒప్పందం ప్రకారం వెనక్కి తగ్గాయి.



 అయితే ఇప్పుడు మరోసారి సరిహద్దుల్లో చైనా తోక జాడింపు చర్యలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.  ప్రస్తుతం భారత్లో కరోనా కారణంగా ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యంలో.. పరిస్థితులు అధ్వాన్నంగా మారిపోతున్నాయి. ఈ క్రమంలోనే ఆక్సిజన్ కొరత ఏర్పడుతూ రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం త్రివిధ దళాలను కూడా రంగంలోకి దింపింది.  యుద్ధ విమానాల ద్వారా ఆక్సిజన్ వివిధ దేశాల నుంచి తప్పించుకుంటుంది.. ఎంతోమంది ఆర్మీ డాక్టర్లు కరోనా వైరస్ రోగులకు చికిత్స అందిస్తున్నారు. ఇక నేవి ద్వార కూడా ఆక్సిజన్ దిగుమతి చేసుకుంటుంది భారత్.



 ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో...  ప్రస్తుతం చైనా మరోసారి సరిహద్దుల్లో తోక జాడింపు చర్యలకు పాల్పడుతున్నట్లు తెలుస్తుంది   ప్రస్తుతం భారత త్రివిధ దళాలు దేశం కోసం పనిచేస్తున్న సమయంలో ప్రస్తుతం చైనా సరిహద్దుల్లో శాశ్వత నిర్మాణాలు కట్టెందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మళ్ళీ ఇక ఎల్ఓసి వెంట భారత సైన్యం  మొహరింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది  ఇటీవలే ఎల్ఓసి దగ్గర ఉన్నటువంటి రాజోలిలోని ఫార్వర్డ్ బ్లాక్ కి ఆర్మీ జనరల్ నరవానే వెళ్లడం అనేది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిపోయింది . రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: