కరోనాకు జీవించే హక్కా.. మాజీ సీఎం గారూ గిదేందీ కొత్తగా?

praveen
కరోనా వైరస్ కోరలు చాస్తూ అందరిని చంపేస్తోంది.రోజురోజుకు శరవేగంగా విజృంభిస్తున్న ఈ మహమ్మారి వైరస్ చిన్న పెద్ద.. ధనిక పేద అనే తేడా లేకుండా అందరి పై పంజా విసురుతోంది.  రోజురోజుకు మహమ్మారి వైరస్ ప్రభావం పెరిగిపోతుండడంతో దేశంలో క్లిష్ట పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రతిరోజు దేశంలో నాలుగు లక్షల వరకు కొత్త కేసులు వెలుగులోకి వస్తున్నాయి అంటే.. పరిస్థితులు రోజు రోజుకు ఎంత అధ్వానంగా మారిపోతున్నాయో అర్థం చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతం అన్ని రాష్ట్రాలు కూడా కరోనా వైరస్ మహమ్మారి బారిన పడి అల్లాడి పోతున్నాయి. కొన్ని రాష్ట్రాలలో అయితే అల్లకల్లోలం సృష్టిస్తుంది ఈ మహమ్మారి వైరస్.



 మొదటి రకం  వైరస్ తో పోల్చి చూస్తే రెండవరకం కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందడమే కాదు ఎక్కువగా ప్రభావం చూపుతుంది. ఈ క్రమంలోనే వైరస్ బారిన పడిన ఎంతోమంది ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు. అంతేకాకుండా ఇక ఎంతోమందిని బలి తీసుకుంటుంది ఈ మహమ్మారి వైరస్. ఇలాంటి నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రజలందరిలో ధైర్యం నింపేందుకు అందరూ ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని ఇక అందరం కలిసికట్టుగా ఈ మహమ్మారి వైరస్ ను చంపి పాతరేద్దాం అంటూ ఎన్నో మాటలు చెబుతున్నారు.



 మరికొంత మంది ముఖ్యమంత్రులు ఈ వైరస్ ను రాష్ట్రం నుంచి తరిమి కొడదాం అంటూ చెబుతున్నారు. కానీ ఇక్కడ ఒక మాజీ ముఖ్యమంత్రి మాత్రం ఏకంగా కరోనా వైరస్ కు జీవించే హక్కు ఉంది అంటూ సరికొత్త హక్కు గురించి మాట్లాడటం మొదలు పెట్టారు.  ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ చేసిన వ్యాఖ్యలు కాస్త ప్రస్తుతం వివాదాస్పదంగా మారి పోయాయి.  కరోనా వైరస్ కూడా మనుషుల లాంటి జీవి అని..  మనుషులు ఎలా అయితే జీవించాలని అనుకుంటారో వైరస్ కూడా జీవించాలని అనుకుంటుంది అంటూ వ్యాఖ్యానించారు ఆయన. జీవించాలనే కోరికతోనే వైరస్ రూపాంతరం చెందుతుందని..కరోనా వైరస్ కు జీవించే హక్కు కూడా ఉంది అంటూ మాజీ సీఎం త్రివేంద్ర సింగ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఎన్నో విమర్శలకు తావిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: