కరోనా ఎఫెక్ట్ : లోకల్ విమానాలు రద్దు..

Purushottham Vinay
ఇక దేశంలో కరోనా కలకలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. రోజు రోజుకి కేసులు చాలా ఎక్కువైపోతున్నాయి. చాప కింద నీరు లాగా అన్ని వైపులా వ్యాపిస్తుందే తప్ప ఏమాత్రం తగ్గట్లేదు.కరోనా తీవ్రత తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా దారుణంగా వుంది. తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ లో కూడా కేసులు చాలా ఎక్కువైపోతున్నాయి.ఇక ఈ ప్రయాణాలు కూడా కరోనా ఉధృతి కి కారణమవుతున్నాయి. ఇక చాలా మంది విమానాల్లో ప్రయాణించడం వలన కరోనా కేసులు చాలా ఎక్కువవుతున్నాయి. కరోనా కేసులు ఎక్కువవుతున్న నేపథ్యంలో లోకల్ విమానాలను రద్దు చెయ్యడం జరిగింది.శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి వివిధ నగరాలకు అనేక దేశీయ విమానాలు శుక్రవారం అర్ధరాత్రి నుండి రద్దు చేయబడ్డాయి.హైదరాబాద్- ఢిల్లీ, హైదరాబాద్-పూణే, చెన్నై, బెంగళూరులకు దాదాపు 30 విమానాలు రద్దు చేయబడ్డాయి. కోవిడ్ -19 సెకండ్ వేవ్ నేపథ్యంలో వివిధ నగరాల్లో ప్రయాణికులపై ఆంక్షలు విధించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు విమానాశ్రయ వర్గాల నుంచి సమాచారం అందింది.

అంతేకాకుండా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికులు 14 రోజులు దిగ్బంధంలో ఉండాల్సి ఉంటుంది. వివిధ రాష్ట్రాల్లో కూడా, కోవిడ్ 19 వైరస్ తీవ్రతరం కావడానికి ముందే విమానాలను జాగ్రత్తగా రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు. రాత్రి కర్ఫ్యూ సమయంలో ట్రాఫిక్ రద్దీ కారణంగా ప్రయాణీకులు తమ ప్రయాణాలను కూడా వాయిదా వేస్తున్నారు.

ఫలితంగా, విమానంలో ప్రయాణించే వారి సంఖ్య గణనీయంగా పడిపోయింది. విమానాలు రద్దు కావడానికి ఇది కూడా ఒక కారణం అనిపిస్తుంది. ఇది దేశీయ విమానాలతో పాటు అంతర్జాతీయ సేవలను ప్రభావితం చేసింది. ఇప్పటికే, వివిధ దేశాలు భారతదేశం నుండి విమానాలకు ఆంక్షలు విధిస్తున్నాయి. దీని నేపథ్యంలో హైదరాబాద్ నుంచి లండన్, దుబాయ్, షార్జాకు సర్వీసులు రద్దు చేయబడ్డాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: