నారా లోకేష్ పై ఎఫ్ఐఆర్ నమోదు ?
ఆంధ్రప్రదేశ్ లో కేసుల పరంపర కొనసాగుతోంది. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పరిపాలనను మరియు ప్రజల సంరక్షణ బాధ్యతలను పక్కన పెట్టేసి కేవలం తన రాజకీయ కక్షను తీర్చుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు రోజూ ఏదో ఒక విమర్శ చేస్తూనే ఉన్నారు. కానీ ఈ విమర్శల పైన వైసీపీ వారు స్పందించడం పక్కన పెడితే తెలుగుదేశం నాయకులపై దొరికిన వారిపై దొరికినట్టు కేసులు పెడుతున్నారు. ఇప్పటికే కొంత మంది తెలుగుదేశం పార్టీ నాయకులపై కేసులు పెట్టగా, వారంతా బెయిల్ పై బయటకొచ్చిన విషయం తెలిసిందే. గత నెలలో సంగం డైరీ చైర్మన్ గా ఉన్న ధూళిపాళ్ల నరేంద్రను కూడా ఏసీబీ అరెస్ట్ చేయడం చూశాము. ఈయన ప్రస్తుతానికి రిమాండ్ లో ఉన్నారు.
ఇది మరిచిపోకముందే నిన్న మాజీ సీఎం మరియు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. దీనిపై వారు కోర్టుకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా నారా లోకేష్ పై కేసు పెట్టడం సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే, ఈ కేసును అనంతపురం జిల్లా మరియు కర్ణాటక రాష్ట్ర సరిహద్దుల్లో జరిగిన ఒక సంఘటనను ఉద్దేశించి..అది ఏపీకి సంబంధించినది కాకపోయినా రాజకీయ దురుద్దేశంతో ప్రభుత్వ విప్ మరియు రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రాంచంద్రారెడ్డి ని నిందిస్తూ మరియు హెచ్చరిస్తూ సామాజిక మాధ్యమాలలో పోస్టులు పెట్టడం జరిగింది. దీనిపై కాపు రామచంద్ర రెడ్డి బాధపడుతూ ఈ పోస్టులపై అభ్యంతరం తెలియచేస్తూ నారా లోకేష్ పై కేసు పెట్టడం జరిగింది.
అనంతపురం లోని డి హీరేహాళ్ పోలీస్ స్టేషన్ లో క్రైమ్ నెంబర్ 111-2021 / ఐపీసీ సెక్షన్ 153A, 505,506 సెక్షన్ ల కింద కేసు నమోదు చేశారు. అయితే వీరు ఏవైతే వీడియోలు పోస్టు చేశారో అవి జరిగిన స్థలం మన ఏపీ రాష్ట్రము క్రిందకు రాదు. కర్ణాటక రాష్ట్ర సరిహద్దు కిందకు వస్తుంది. కానీ అక్కడ జరిగిన సంఘటనను మన ఏపీలో జరిగినట్లుగా వీడియోలు పోస్ట్ చేసి సీరియస్ గా వ్యాఖ్యలు చేశారు. మరి ఈ కేసులో అయినా నోటీసులిచ్చి విచారణ జరుపుతారా లేదా ముందస్తుగానే కోర్టుకెళ్లి స్టే తీసుకుంటారా అనేది తెలియాల్సి ఉంది. దీనిపై టీడీపీ నాయకులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.