కరోనాకి 5జీ టెస్టింగ్ కి సంబంధం ఉందా..?

Suma Kallamadi
సరిగ్గా ఏడాది క్రితం మొదలైన కరోనా వైరస్ వ్యాప్తి ఈనాటికి వ్యాప్తి చెందుతూనే ఉంది. కొన్నాళ్ల పాటు సైలెంట్ గా ఉన్నట్లు నటించింది. కానీ అంతలోనే మళ్ళీ కరోనా వైరస్ తన కోరలు చాచింది.ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. మొత్తం దేశాన్ని అల్లకల్లోలం చేస్తుంది ఈ వైరస్. ఏ రోజు ఎటువంటి భయానకరమైన వార్త వినవలిసి వస్తుందో అర్ధం కావడం లేదు. ప్రతి రోజు లక్షల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఆస్పత్రుల బయట రోగులు బెడ్స్ కోసం నిరీక్షిస్తూ చనిపోతున్నారు. అసలు ఏ వైరస్ ఎక్కడినుంచి వచ్చిందో కూడా తెలియడం లేదు. 

అయితే ఈ నేపథ్యంలో తాజాగా కరోనా సెకండ్ వేవ్‌కు సంబంధించి ఓ ఆడియో క్లిప్‌ ఒకటి సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది. అది ఏంటంటే.. 5జీ టెస్టింగ్ వల్లనే కరోనా వైరస్ సెకండ్ వేవ్ వ్యాప్తి అనేది వేగవంతం అయిందని ఒక ఆడియో క్లిప్ ఒకటి వైరల్ అయింది. అలాగే దీన్ని టెస్ట్ చేసిన రాష్ట్రాలు యూపీ, బిహార్‌, మహారాష్ట్రలో భారీ సంఖ్యలో జనాలు మరణించారని ఆడియోక్లిప్‌లో ఉంది. ఈ నేపథ్యంలో దీనిపై నిగ్గు తేల్చేందుకు ప్రెస్ ఇన్‌ఫర్‌మేషన్ బ్యూరో (పీఐబీ) రంగంలోకి దిగింది.అయితే ఈ వార్తలపై టెలికామ్ అధికారులు ఆదోళన వ్యక్తం చేశారు.

 ఇవన్ని ఫేక్ అని స్పష్టం చేశారు. కోవిడ్ వ్యాప్తికి, 5జీ టెక్నాలజీకి సంబంధించిన పుకార్లపై టెలికాం పరిశ్రమ సంస్థ, సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా శుక్రవారం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు సీఓఏఐ, టవర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్స్ అసోసియేషన్ ఒక ప్రకటన విడుదల చేసింది. కోవిడ్ కేసులు పెరగడానికి 5జీ స్పెక్ట్రం ట్రయల్సే కారణం అంటూ వచ్చిన వీడియో అవాస్తవం అని స్పష్టం చేశాయి. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) కూడా స్పందించిందని తెలిపారు. 5 జీ టెక్నాలజీకి, కోవిడ్ -19 కి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసిందని సిఐఐఐ డైరెక్టర్ జనరల్ ఎస్పీ కొచ్చర్ తెలిపారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: