
కరోనా ఎఫెక్ట్.. సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో టైమింగ్ చేంజ్?
అయితే రాష్ట్ర ప్రభుత్వం కర్ఫ్యూ విధించడమే కాదు వివిధ రకాల ప్రభుత్వ కార్యాలయ పని వేళల్లో కూడా మార్పులు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో బ్యాంకుల పని వేళల్లో మార్పులు చేస్తూ నిర్ణయం ఆయా అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే బ్యాంకుల పని వేళలను వేళలను కుధించారు అధికారులు. అదే సమయంలో అటు రిజిస్ట్రారు కార్యాలయం పని వేళల్లో కూడా కీలక మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ప్రజలందరూ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పని పనివేళలో చేసిన మార్పులను గమనించాలి అంటూ సూచిస్తున్నారు అధికారులు.
రాష్ట్రంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయాలు ఉదయం ఏడున్నర గంటల నుంచి 11:30 గంటల మధ్య పని చేస్తాయని అధికారులు తెలిపారు. అంతేకాకుండా మారిన పని వేళలను నేటి నుంచి అమలులోకి వస్తాయని ప్రజలందరూ గమనించాలి అని సూచించారు. ప్రస్తుతం కరోనా వైరస్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుందని అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కఠినమైన కర్ఫ్యూ అమలులోకి తీసుకు రావడంతో ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు అధికారులు. సూచించిన సమయాల్లోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ కు రావాలని తెలిపారు.