రేపటి నుండి లాక్ డౌన్ ఇందులో నిజమెంత ?
అయితే ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ ప్రభావం ప్రజల్ని ముంచేస్తున్నా...కరోనా మరణాల రేటు కలవరపెడుతున్నా ఎక్కడా కూడా పూర్తి స్థాయి లాక్ డౌన్ ఊసే ఎత్తడం లేదు. పలు రాష్ట్రాల్లో పాక్షికంగా లాక్ డౌన్ నడుస్తున్నప్పటికీ అవి పెద్దగా కరోనా తీవ్రతపై ప్రభావం చూపడంలేదన్న భావనలు వ్యక్తమవుతున్నాయి. వైరస్ వ్యాప్తి తీవ్రత ప్రమాద ఘంటికలు మోగిస్తున్నా ... కేంద్రం పూర్తి స్థాయి లాక్ డౌన్ వైపుగా రాష్ట్ర ప్రభుత్వాలు అడుగులు వేసేలా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే అందుకు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా ఒక కారణమై ఉండొచ్చని అంటున్నారు పలువురు రాజకీయ విశ్లేషకులు.
అయితే ఈ రోజుతో 5 రాష్ట్రాలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పాటుగా తిరుపతి ఎంపీ ఉప ఎన్నిక మరియు నాగార్జున సాగర్ ఎమ్మెల్యే ఉప ఎన్నిక ఫలితాలు కూడా ఈ రోజే వెలువడ్డాయి. ఈ సందర్భంలో మళ్లీ దేశంలో పూర్తి స్థాయి లాక్ డౌన్ ను కేంద్రం అమలు చేసే అవకాశం ఉందన్న మాటలు వినపడుతున్నాయి. మరి నిజంగానే దేశంలో కరోనా పీక్స్ కు చేరుతున్న క్రమంలో ప్రధాని మోదీ ఈ రాత్రికి ఏమన్నా లాక్ డౌన్ గురించి ప్రకటన చేస్తారా చూడాలి. ఇప్పటికే ప్రపంచ దేశాలన్నీ మోదీ పై నిప్పులు చెరుగుతున్నవేళ ముందు ముందు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటాడనేది తెలియాల్సి ఉంది.