మోడీకి తెలుగు ప్రజలు దెబ్బేసారే..?

praveen
గత కొన్ని రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో చూసుకుంటే టీడీపీ కాస్త క్రియాశీలక పాత్ర వ్యవహరించింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీకి కంచుకోట లాంటి దుబ్బాక నియోజక వర్గంలో ఉప ఎన్నికలు జరగగా అక్కడ ఎవరూ ఊహించని విధంగా అనూహ్యంగా బిజెపి విజయం సాధించింది. ఆ తర్వాత జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నిక లో కూడా బిజెపి సత్తా చాటి దాదాపు టిఆర్ఎస్ తో సమానంగా సీట్లు సాధించింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇటీవలే నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో కూడా ముమ్మర ప్రచారం నిర్వహించింది. బీజేపీలోని కీలక నేతలు అందరూ రంగంలోకి దిగి ప్రచారం నిర్వహించారు.



 ఇకపోతే  నాగార్జునసాగర్ ఉప ఎన్నికకు సంబంధించిన ఫలితాలు రాగా ఈ ఫలితాల్లో అటు బిజెపి పూర్తిగా తేలిపోయింది అనే చెప్పాలి. కనీసం రెండవ స్థానంలో కూడా నిలువలేకపోయింది. టిఆర్ఎస్ ఆధిక్యంలో కొనసాగుతోంది.. రెండవ స్థానంలో కాంగ్రెస్ పోటీ ఇస్తోంది.. ఇక బిజెపి మూడవ స్థానంలో కొనసాగుతోంది అదే సమయంలో అటు ఏపీలో తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో కూడా బీజేపీ పరిస్థితి ఇదే రీతిలో మారిపోయింది. ఇక్కడ కూడా కేంద్ర మంత్రులు సైతం రంగంలోకి దిగి ప్రచారం నిర్వహించారు అయినప్పటికీ ప్రజలు మాత్రం లోకల్ పార్టీని నమ్మారు.   ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి గురుమూర్తి ఒక లక్షా 50 వేల పైచిలుకు మెజారిటీ తో కొనసాగుతున్నారు.



 తిరుపతి నాగార్జునసాగర్ ఉప ఎన్నికల ఫలితాలు బీజేపీ దాదాపు ఉనికి కోల్పోయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. రెండు చోట్ల ఏ ఒక్కరు రౌండ్ లో కూడా ఆధిక్యత కనబర్చ  లేకపోయింది భారతీయ జనతా పార్టీ. ఇప్పటివరకు నాగార్జునసాగర్ ఏ రౌండ్ లో కూడా 1000కి మించి ఓట్లను సాధించలేకపోయింది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడిప్పుడే బీజేపీ ఉనికి చాటి ఎదుగుతుంది అనుకుంటున్న తరుణంలో బిజెపి కనీస ఓట్లు సంపాదించకపోవడంతో మళ్ళీ బిజెపి తేలిపోయింది అని అంటున్నారు విశ్లేషకులు. బీజేపీ క్రియాశీలక పార్టీగా ఎదగాలి అంటే ఇంకా చాలా సమయం పడుతుంది అని అంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: