కరోనా ఉన్న వారిలో ఈ రెండు లక్షణాలు చాలా ప్రమాదమట ?
ఓ వైపు అత్యవసరమైతే తప్ప.. సాధారణ లక్షణాలకు ఇంట్లోనే చికిత్స తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
కరోనా సోకితే చాలా మంది సాధారణ లక్షణాలతోనే బయటపడుతున్నప్పటికీ మరి కొందరిలో దీని ప్రభావం ఎక్కువగా ఉంటోంది. కరోనా శరీరంలోని అన్ని అవయవాలపై దాడి చేస్తోంది. ముఖ్యంగా శ్వాసకోశ వ్యవస్థను క్షీణింపచేసి మనిషి ప్రాణాలను ప్రమాదంలో పడేస్తోంది. అయితే కరోనా సోకిన వారిలో రెండు లక్షణాలు ముఖ్యంగా ప్రమాదాన్ని సూచిస్తాయి. ఆ తర్వాత వాటి నుండి కోలుకోవడానికి చాలా కాలం పడుతుందని అంటున్నారు వైద్యనిపుణులు. కరోనా సోకిన కొందరిలో జ్వరం, పొడి దగ్గు, జలుబు సాధారణ లక్షణాలతో పాటుగా తీవ్రంగా కడుపునొప్పి మరియు కొందరిలో విరోచనాలు వంటి సమస్యలు తలెత్తుతున్నాయి.
సాధారణ లక్షణాలు ఉన్న కరోనా రోగులు త్వరగానే కోలుకుంటున్నారు కానీ.. కడుపు నొప్పి మరియు విరోచనాలు, ఈ రెండు లక్షణాలు ఉన్న వారు మాత్రం కరోనా నుండి కోలుకోవడానికి ఎక్కువ కాలం పడుతున్నట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి. అలాగే సాధారణ సమస్యలతో పాటు ..ఈ రెండు సమస్యలు ఉండే వారిలో ఎక్కువగా ప్రమాద స్థాయి పెరుగుతుందని గమనించినట్లు చెబుతున్నారు. ఇలాంటి వారు అశ్రద్ధ చేయకుండా సమస్య పెరిగితే వెంటనే డాక్టర్ని సంప్రదించాలని సూచిస్తున్నారు. కాబట్టి కరోనా వచ్చి ఇబ్బంది పడడం కన్నా, అసలు కరోనా వైరస్ రాకుండా జాగ్రత్త పడితే ఏ గొడవా ఉండదని మరి కొందరు చెబుతున్నారు.