కరోనా ఎఫెక్ట్.. ఆ యాప్స్ కి తెగ డిమాండ్..?
ఇలా ఎక్కడికి వెళ్లాలన్నా ఏం చేయాలన్నా కూడా ప్రజలందరూ వెయ్యిసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి నేపథ్యంలో ఎంతోమంది ఇక ఇంటి పట్టునే ఉండాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఇంటి పట్టునే ఎలాంటి వ్యాయామం చేయకుండా ఉంటే ఫిట్నెస్ రోగనిరోధక శక్తి ఎలా పెరుగుతుంది అని ఆలోచనలో పడిపోయి చివరికి ఒక వినూత్న ఆలోచన చేస్తున్నారు ప్రతి ఒక్కరు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో వ్యాయామశాల కు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో ఫిట్నెస్ యాప్ లను ఎక్కువగా ఆశ్రయిస్తూ ఉన్నారు. ఫిట్నెస్ యాప్ లో చెప్పే సూచనల ప్రకారం ఫాలో అవుతూ ఇక ఇంటి పట్టునే ఉంటూ వ్యాయామాలు ఫిట్నెస్ సాధించి రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
ఈ క్రమంలోనే కరోనా వైరస్ సమయంలో ఫిట్ నెస్ యాప్ లకు ఎంతగానో డిమాండ్ పెరిగి నట్లు తెలుస్తోంది. కేవలం రెండు నెలల్లోనే ఫిట్నెస్ యాప్ డౌన్లోడింగ్ 20 శాతం పెరిగినట్లు సమాచారం. ఇప్పటికీ వర్క్ ఫ్రొం హోమ్ తో ఎంతగానో ఒత్తిడికి లోనవుతున్నారు చాలామంది. అదేసమయంలో ప్రస్తుతం ప్రభుత్వాలు కరోనా వైరస్ కట్టడి లో భాగంగా కర్ఫ్యూ కూడా విధిస్తున్నాయి. ఈ క్రమంలోనే శారీరక మానసిక ఆరోగ్యం కోసం ఎంతోమంది ఈ యాప్ లను ఆశ్రయిస్తున్నారు ఇందులో చెప్పిన ప్రకారం తమ రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.