కాళ్ళు మొక్కినా కనికరం సూపలే.?
ముఖ్యంగా ధనవంతుల పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ పేద మధ్యతరగతి ప్రజల పరిస్థితి మాత్రం అగమ్యగోచరంగా మారిపోయింది అని చెప్పాలి. ఓ వైపు వైరస్ నుంచి కాపాడుకోవడానికి ఇంట్లో ఉండలేక మరోవైపు కుటుంబపోషణ కోసం బయటకు వెళ్ళలేక.. ఇలా వైరస్ కారణంగా ప్రతిక్షణం భయపడుతూనే బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా దేశంలో రోజురోజుకు ఏర్పడుతున్న ఆక్సిజన్ కొరత మాత్రం అందరినీ బెంబేలెత్తిస్తోంది అని చెప్పాలి. ఆక్సిజన్ కొరత కారణంగా ఎన్నో హృదయ విదారక ఘటనలు వెలుగులోకి వస్తు అందర్నీ కంటతడి పెట్టిస్తున్నాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.
దేశంలో ఇప్పటికే ఎన్నో ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరత ఏర్పడగా ఇక్కడ ఓ వ్యక్తికి ఇలాంటి దుస్థితి ఏర్పడింది. యూపీలోని ఆగ్రాకు చెందిన ఓ వ్యక్తి తన తల్లి కోసం ఎంతో కష్టపడి ఆక్సిజన్ సిలిండర్ సంపాదించాడు. కానీ అంతలోనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఏమైందో తెలియదు కానీ తన తల్లికి చికిత్స అందిస్తున్న ఆస్పత్రి నుంచి అన్ని ఆక్సిజన్ సిలిండర్ లను తీసుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో సదరు వ్యక్తికి ఏం చేయాలో అర్థం కాలేదు ఆక్సిజన్ సిలిండర్లు తీసుకు వెళ్తే తన తల్లి ప్రాణం పోతుందేమో అని విలవిలలాడి పోయాడు.. దయచేసి ఆక్సిజన్ సిలిండర్లు తీసుకెళ్ళండి సార్ అంటూ మోకాళ్ళపై కూర్చుని కాళ్లు పట్టుకున్న పోలీసులు మాత్రం వినలేదు. ఆ తర్వాత పోలీసులను వివరణ కోరితే ఖాళీ సిలిండర్లు తీసుకెళ్ళాము అంటూ చెప్పుకొచ్చారు.