దేశంలో భారీగా రికవరీ రేటు.. కానీ ఈలోగానే..?

praveen
ఎక్కడికి వెళ్లినా.. ఏం చేస్తున్నా.. ఏం చేయకపోయినా.. ఎటు చూసిన ఎటు చూడకపోయినా ప్రస్తుతం దేశ ప్రజలందరిలో నెలకొంది కరోనా వైరస్ భయం.  మొదటి రకం వైరస్ తో పోల్చి చూస్తే రెండవరకం వైరస్ మరింత ప్రమాదకారి గా మారిపోతుంది. వేగంగా వ్యాప్తి చెందుతూ వుండటం అందరినీ మరింత భయాందోళనకు గురిచేస్తుంది. అయితే ప్రస్తుతం దేశంలోని ప్రజలందరూ మహమ్మారి కరోనా వైరస్ పై పూర్తిస్థాయి అవగాహన ఉంది. అటు ఎన్నో జాగ్రత్తలు పాటిస్తున్నప్పటికీ ఏదో ఒక విధంగా ఈ మహమ్మారి వైరస్ మాత్రం పంజా విసురుతోంది. వెరసి రోజు రోజుకు కరోనా వైరస్ కేసులు సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. గత ఏడాది కనీసం రెండు లక్షలు కూడా దాటని కారణం వైరస్ కేసులు సంఖ్య ఈ ఏడాది మాత్రం రెట్టింపు పెరిగిపోతున్నాయి. ఏకంగా ప్రతిరోజు మూడు లక్షలకు పైగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.



 ఇలాంటి నేపథ్యంలో ప్రస్తుతం దేశ ప్రజానీకం మొత్తం ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బ్రతుకుతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఓవైపు కరోనా వైరస్ ప్రాణం తీస్తుంది అనే భయం నెలకొంటే మరోవైపు లాక్డౌన్ వచ్చి ఇక దుర్భర స్థితిని గడిపి ప్రాణం పోయే పరిస్థితి ఏర్పడుతుంది అని భయంతో ప్రస్తుతం అందరూ ఎంతో భయపడి పోతున్నారు. అయితే ఒకవైపు రోజురోజుకు కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరిగి పోతూ ఉంటే ఇక దేశంలో రికవరీ రేటు మాత్రం అందరిలో కాస్త ధైర్యం నింపుతుంది అని చెప్పాలి. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ కేసులు పెరిగిపోవడమే కాదు అటు రికవరీ రేటు కూడా పెరిగిపోతుంది అని అర్థమవుతుంది.



 ప్రస్తుతం దేశంలో మూడు లక్షలకు పైగా కేసులు నమోదు అవుతున్న తరుణంలో.. కరోనా వైరస్ కేసులు సంఖ్య కూడా ఎనిమిదిన్నర శాతం వరకు తగ్గినట్లు తెలుస్తుంది.   అదే సమయంలో రికవరీ రేటు కూడా గణనీయంగా పెరిగింది. ఏకంగా 2,61000 మంది కరోనా వైరస్ రోగులు ఈ మహమ్మారి వైరస్ తో పోరాడి చికిత్స తీసుకుని కోలుకున్నారు.  అయితే గతంలో ఎప్పుడూ కూడా ఈ రేంజిలో ఒకేరోజు కరోనా రికవరీ రేటు లేదు అనే చెప్పాలి. రికవరీ రేటు పెరిగిన నేపథ్యంలో ఆ వైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం  వైరస్ కేసులు పెరిగిపోయాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 8, 9 వేలు ఉన్న కేసుల సంఖ్య ఏకంగా ఒక్కసారిగా 14000 దాటింది. గడచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 74624 పరీక్షలు నిర్వహించగా.. 14669 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఓ వైపు రికవరీ రేటు పెరిగిందని సంతోషపడే లోకి మరోవైపు కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: