షాకింగ్..! ప్రధాని మోడీయే ఓ సూపర్ కరోనా స్ప్రెడర్‌..?

Chakravarthi Kalyan
భారత దేశంలో కరోనా సెకండ్ వేవ్‌ దారుణంగా విరుచుకుపడుతున్న వేళ.. ప్రధాని నరేంద్ర మోడీ తీరుపై ఇంటా బయటా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విదేశీ పత్రికలు సైతం ఆయన వ్యవహారశైలిని.. కరోనా సమయంలో మోడీ సర్కారు పని తీరును విమర్శిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ప్రతిపక్షాలు మాత్రమే మోదీని విమర్శించాయి. కానీ ఇప్పుడు కీలక స్థానాల్లో ఉన్న మేథావులు, నిపుణులు కూడా మోడీ వైఖరిని విమర్శిస్తున్నారు.

తాజాగా.. ఇప్పుడు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ .. ఐఎంఏ ఉపాధ్యక్షుడు డాక్టర్ నవజ్యోత్ దహియా మోడీని తీవ్రంగా విమర్శించారు.  కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ వేళ ఎన్నికలు జరుగుతుండడంపై  ఆయన మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీనే కరోనా వైరస్ ను ఎక్కువగా వ్యాప్తి చేసే సూపర్ స్ప్రెడర్ అని అభివర్ణించారు  ఐఎంఏ ఉపాధ్యక్షుడు డాక్టర్ నవజ్యోత్ దహియా. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా  మోడీ బహిరంగ సభలు ఏర్పాటు చేశారని, కుంభమేళాకు అనుమతించారని మోదీపై ఆరోపణలు చేశారు.

ఓవైపు వైద్య రంగం అంతా కొవిడ్ నిబంధనలపై ప్రజల్లో అవగాహన కలిగించే యత్నాలు చేస్తుంటే.. మరోవైపు ప్రధాని మోదీ మాత్రం భారీ బహిరంగ సభలు పెట్టేందుకు ఏమాత్రం వెనుకాడలేదని ఆయన మండిపడ్డారు. ప్రధాని మోడీ కరోనా మార్గదర్శకాలన్నింటినీ  గాలికొదిలేశారు అని దహియా విమర్శించారు. మరోవైపు విదేశీ మీడియా కూడా మోడీపై జోరుగా విమర్శలు చేస్తోంది. నిన్నటికి నిన్న ప్రపంచ మీడియా ప్రధాని తీవ్రంగా విమర్శిస్తూ  కథనాలు ప్రచురించింది.

నిన్న మొన్నటి వరకూ ప్రపంచంలోని 78 దేశాలకు కరోనా వ్యాక్సిన్ పంపి జేజేలు అందుకున్న మోడీ సర్కారుకు కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. ప్రశంసల స్థానంలో విమర్శలు జోరుగా వస్తున్నాయి. కరోనా మొదటి విడతలో ఇండియాపై భారీగానే ప్రభావం చూపినా.. రెండో వేవ్ వస్తుందని నిపుణులు చెప్పినా.. కేంద్రం సరిగ్గా పట్టించుకోలేదన్న విమర్శలు ఇప్పుడు నరేంద్ర మోడీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: