కరోనా సాకుతో ఇలాంటి చర్యలా.. జగన్ సహిస్తారా..?

praveen
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజురోజుకు కరోనా వైరస్ విజృంభిస్తుంది. ఈ మహమ్మారి వైరస్ శరవేగంగా పాకి పోతూ ఉండడంతో  ప్రజలందరూ బెంబేలెత్తిపోతున్నారు. ఎన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఏదో ఒక విధంగా ఈ మహమ్మారి వైరస్ వ్యాప్తి చెందుతూ ఉండడంతో  ప్రజలందరిలో ప్రాణ భయం నెలకొంది అని చెప్పాలి.  అయితే రోజురోజుకూ పెరిగిపోతున్న కేసులు చూస్తూ ఉంటే గత ఏడాది లాక్డౌన్ సమయంలో వచ్చిన దుస్థితి మళ్లీ వచ్చే అవకాశం ఉంది అని భయపడి పోతున్నారు జనాలు. ఓవైపు వైరస్ ఎక్కడ దాడి చేస్తుందో అనే ప్రాణభయంతో ఉంటే మరో వైపు లక్ డౌన్ వస్తే ఎక్కడ దుర్భర స్థితి అనుభవించాల్సి వస్తుందోనని బెంబేలెత్తిపోతున్నారు.


 ఇకపోతే అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెరిగిపోతున్న కేసులు చూస్తూ ఉంటే రానున్న రోజుల్లో మరింత విపత్కర పరిస్థితులు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఓ వైపు కరోనా వైరస్ పెరిగిపోతూ ప్రజలందరూ బెంబేలెత్తి పోతుంటే మరోవైపు కొంతమంది మాత్రం కరోనా వైరస్ ను తమకు అనుకూలంగా మార్చుకుని తన పని చేస్తున్నట్లు తెలుస్తోంది.  కరోనా వైరస్ క్లిష్ట పరిస్థితుల్లో ఎంతో బాధ్యతగా వ్యవహరించాల్సిన ప్రభుత్వ ఉద్యోగులు కరోనా వైరస్ ను కారణంగా చూపి ఏకంగా ఆఫీసులకు రావడమే మానేశారు.


 రోజులు గడుస్తున్న కొద్దీ ఇక ప్రభుత్వ ఆఫీసుకు ఖాళీగా కనిపించడంతో అనుమానం వచ్చిన గ్రామస్థులు సర్పంచ్ ఫిర్యాదు చేయగా ఆధిపత్యం ప్రదర్శించేందుకు ప్రయత్నించాడు సర్పంచ్  . నెల్లూరు లో వెలుగులోకి వచ్చింది ఈ ఘటన. ఆత్మకూరు మండలం గ్రామంలో గ్రామస్తులు అందరూ సర్పంచ్ తో కలిసి సచివాలయం లో ఉన్న సామాన్లు మొత్తం బయటపడేసే ఇక సచివాలయానికి తాళం వేశారు. వారం నుంచి సచివాలయ సిబ్బంది విధులకు హాజరు కావడం లేదు.. అనే కారణంతో సచివాలయానికి తాళం వేశారు.  అయితే దీన్ని అటు విశ్లేషకులు మాత్రం తప్పు పడుతున్నారు కరోనా వైరస్ కారణం చూపి ప్రస్తుతం తమ ఆధిపత్యాన్ని చెలాయించేందుకు ప్రయత్నిస్తున్నారు సర్పంచులు అని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: