కని కరోనా : వైరస్ తో భార్య మృతి.. చివరికి భర్త ఐసీయూలో..?
కరోనా వైరస్ వెలుగులోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటికే ఎన్నో హృదయ విదారక ఘటన మీదికి వచ్చాయి అన్న విషయం తెలిసిందే. ఎన్నో ఘటనలు ప్రస్తుతం అందరిని కలిచి వేస్తూనే ఉన్నాయి. కరోనా వైరస్ కారణంగా ఎంతోమంది తమ ప్రియమైన వారి కడచూపు కూడా నోచుకోలేని దుస్థితి ఏర్పడింది. అప్పటివరకు ఆనందంగా సాగిపోతున్న కుటుంబంలో కరోనా వైరస్ విషాదాలు నింపిన ఘటనలు కూడా కోకొల్లలు. ఇక్కడ ఇలాంటి విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది ఎంతో సాఫీగా సాగిపోతున్న సంసారంలో ఎంట్రీ ఇచ్చింది కరోనా వైరస్. భార్యాభర్తలిద్దరికీ కూడా ప్రాణభయం కలిగించింది. అంతే కాదు భార్య ప్రాణాలను తీసేయగా ఇక ఇప్పుడు భర్త కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు.
సంగారెడ్డి జిల్లాలో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలం నాగాధర్ గ్రామానికి చెందిన కాంత రెడ్డి లక్ష్మి దంపతులకు మూడు రోజుల క్రితం కరోనా వైరస్ సోకింది. ఇక అప్పటినుంచి వైద్యుల సూచన మేరకు వారు హోమ్ క్వారంటైన్ లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు అయితే అంతలోనే భార్య లక్ష్మి ఆరోగ్యం విషమించింది. దీంతో వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించింది. ఇక అటు వెంటనే భర్త కాంత రెడ్డి ఆరోగ్యం కూడా క్షీణించింది. దీంతో ఆయనను ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం వెంటిలేటర్‌పై ఐసీయూలో ఆయన చికిత్స పొందుతూ ఉన్నారు. ఇలా సాఫీగా సాగిపోతున్న సంసారంలో అల్లకల్లోలం సృష్టించిన వైరస్ అందర్నీ బెంబేలెత్తిస్తోంది.