కని "కరోనా":మే నెల ద్వితీయార్థం లోపు రోజుకి 5000 మరణాలు నమోదు కానున్నాయా..?

Suma Kallamadi
వాషింగ్టన్ యూనివర్సిటీ చేసిన ఒక అధ్యయనం.. ఇండియాలో మే నెల ద్వితీయార్థం లోపు రోజువారీ కరోనా మరణాలు సంఖ్య 5,600 కు చేరుకుంటుందని హెచ్చరించింది. దేశంలో టీకాలు వేస్తున్న కారణంగా మరణాల సంఖ్య తగ్గే చాన్స్ ఉందని ధీమా వ్యక్తం వాషింగ్టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు మాస్కు సరిగా ధరించడం వలన కూడా 70వేల కరోనా మరణాలు నివారించవచ్చని చెప్పుకొచ్చారు. ఈ అధ్యయనం ప్రకారం.. భారతదేశంలో ఏప్రిల్ నుంచి ఆగస్టు నెలలోపు 3 లక్షల కరోనా రోగులు చనిపోతారని తెలుస్తోంది.


అయితే ఈ అధ్యయనాన్ని "కొవిడ్ - 19 ప్రొజెక్షన్స్" పేరిట ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవల్యూషన్ సంస్థ వాషింగ్టన్ యూనివర్సిటీలో నిర్వహించింది. ఏప్రిల్ 15వ తేదీన ఈ అధ్యయనానికి సంబంధించిన సమాచారాన్ని పబ్లిష్ చేశారు. టీకా వేస్తున్న కారణంగా కొవిడ్ సెకండ్ వేవ్ నుంచి భారతదేశం గట్టేక్కగలదని ఈ అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేశారు. అధ్యయనం కోసం శాస్త్రవేత్తలు ఇండియాలో కరోనా వైరస్ కేసులు, మరణాలకు సంబంధించిన గణాంకాలను సేకరించి.. ఈ ఏడాది మే 10వ తేదీలోపు రోజువారి కొవిడ్ మరణాల సంఖ్య 5,600 చేరుకుంటుందని.. ఏప్రిల్ 12 నుంచి ఆగస్టు 1వ తేదీ లోపు 3 లక్షల 26 వేల మంది చనిపోతారని.. జులై నెల చివరి లోపు భారతదేశంలో మొత్తం మరణాల  సంఖ్య 6,65,000 కి చేరుకుంటుందని అంచనా వేశారు.


సెప్టెంబర్ 2020 నుంచి ఫిబ్రవరి 2021 వరకూ కరోనా వైరస్ వ్యాప్తి గణనీయంగా తగ్గిందని కానీ.. ప్రజల నిర్లక్ష్యం కారణంగా మళ్ళీ కరోనా వైరస్ ఏప్రిల్ నెలలో విజృంభించిందని ఈ అధ్యయనంలో పేర్కొన్నారు. మార్చి చివరి వారంలో కేవలం రోజుకు కేవలం 78,000 కేసులు మాత్రమే నమోదు కాగా.. వాటితో పోలిస్తే ఏప్రిల్ మొదటి వారంలో ప్రతి 24 గంటలకు సగటున కొత్త కేసుల సంఖ్య 1,33,400 కు పెరిగింది. ఈ పెరుగుదల తరువాత "కొవిడ్ 19 ప్రొజెక్షన్స్" అధ్యయనం యొక్క ఫలితాలు వెలుగులోకి వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: