
కని కరోనా : అయ్యబాబోయ్.. ఎవరెస్టు ఎక్కినా కరోనా..
అయితే సామాన్యులు సెలబ్రిటీలు ప్రజాప్రతినిధులు అధికారులు అన్న తేడా లేకుండా అందరి పై పంజా విసురుతుంది ఈ మహమ్మారి వైరస్. వెరసి ప్రజలందరూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రజలందరూ ఎన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ చిన్న చిన్న పొరపాట్ల కారణంగా ఈ మహమ్మారి పంజ విసురుతోంది అనే విషయం తెలిసిందే. అంతే కాదు ఎంతో మందిని ఆస్పత్రి పాలు చేస్తుంది ఇంకా ఎంతో మందికి ప్రియమైన వారిని దూరం చేస్తుంది ఈ కరోనా రక్కసి . దేశ ప్రజానీకాన్ని మొత్తం బెంబేలెత్తిస్తున్న మహమ్మారి కరోనా వైరస్ ఇక ఇటీవల ఏకంగా ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం అయిన మౌంట్ ఎవరెస్ట్ కూడా ఎక్కినట్లు తెలుస్తోంది.
సాధారణంగా ఎంతోమంది ప్రపంచంలోనే ఎత్తైన పర్వతం అయినా ఎవరెస్ట్ ఎక్కి రికార్డు సృష్టిస్తుంటారు. అయితే ఇటీవల ఎవరెస్టు ఎక్కిన పర్వతారోహకులలో ఒక్కడైనా నెస్ అనే వ్యక్తికి వైరస్సోకినట్లు తెలిసింది. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు అతని హెలికాప్టర్ ద్వారా నేపాల్ రాజధాని ఖాట్మండు కు తరలించారు. అయితే గత కొన్ని రోజుల మంచి ఎవరెస్టు పర్వతారోహనతో పర్యటకులను అనుమతించలేదు ఇకలే ఇటీవలే అనుమతించగా ఈసారి పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుందని భావిస్తున్న తరుణంలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం అందరిని ఆందోళనలో ముంచుతోంది.