కరోనాపై రాజకీయాలు కాదు.. ముందు అలా చేయండి..?
ఎంతో సమర్ధవంతంగా నియంత్రణకు చర్యలు చేపట్టాల్సింది పోయి ఇక కరోనా వైరస్పై రాజకీయాలు చేస్తూ ఉండడం మరింత విడ్డూరంగా ఉంది. ఈ క్రమంలోనే ప్రభుత్వాల తీరుపై ప్రస్తుతం విశ్లేషకులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైరస్ ఉదృతంగా తరుణంలో వ్యాప్తికి కారణాలు ఏమిటి అని తెలుసుకోకుండా రాజకీయాలు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇంతకుముందు అయితే కరోనా వైరస్ కేసులు వెలుగులోకి వస్తే ఆ ప్రాంతాన్ని మొత్తం రెడ్ జోన్ లో పెట్టింది ప్రభుత్వం. అంతేకాకుండా కరోనా వైరస్ వచ్చిన వారిని నేరుగా ఆసుపత్రికి తీసుకెళ్లారు.
కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. కరోనా వైరస్ వచ్చినప్పటికీ అందరూ వైరస్ను లైట్ తీసుకుంటున్నారు.. ఈ క్రమంలోనే కరోనా పాజిటివ్ వచ్చినప్పటికీ కొన్ని జాగ్రత్తలు చెప్పి ఇంటికి పంపిస్తున్నారు ఈ నేపథ్యంలో అటు ఇంట్లో వాళ్ళందరూ కూడా కరోనా వైరస్ వచ్చిన వాళ్ళు దగ్గరికి వెళ్లడానికి భయపడుతున్నారు. దీంతో తమకు కావాల్సిన ఆహారాన్ని స్వయంగా కరోనా రోగులు బయటికి వెళ్లి తెచ్చుకుంటున్నారు. కానీ తమకు కరోనా వచ్చింది అన్న విషయాన్ని కూడా బయట పెట్టడం లేదు. ఇలా ఎంతోమందికి వైరస్ పాకి పోతుంది అని అంటున్నారు విశ్లేషకులు. అయితే ఈ విషయంలో అటు ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని లేదంటే మరింత దారుణ పరిస్థితులు వస్తాయని చెబుతున్నారు.