కని కరోనా: వ్యాక్సిన్ వేయించుకున్నా.. ఎంత మందికి మళ్లీ కరోనా వచ్చిందో తెలుసా?
ఇది ఇంకా అందుబాటులోకి రావాల్సి ఉంది. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న కోవాగ్జిన్, కోవిషీల్డ్.. ఈ రెండు టీకాల్లో ఏది మంచిది.. ఈ ప్రశ్న చాలా మందిని వేధిస్తోంది. అయితే నిపుణులు మాత్రం కోవాగ్జినే కాస్త బెటర్ అని చెబుతున్నారు. ఈ టీకాల వేసుకున్న తరవాత ఎంత మందికి మళ్లీ కరోనా వచ్చింది అనే లెక్కల ఆధారంగా కోవాగ్జిన్ బెటర్ అంటున్నారు. ఎందుకంటే.. భారత్ బయోటెక్‌కు చెందిన కొవాగ్జిన్ టీకాను ఇప్పటివరకు 1.1 కోట్ల మంది తీసుకున్నారు. ఇందులో 93 లక్షల మంది మొదటి డోసు వేసుకోగా.. 17 లక్షల మంది రెండు డోసులూ స్వీకరించారు. మొదటి డోసు తీసుకున్న వారిలో 4,208 మంది మళ్లీ కొవిడ్ బారిన పడ్డారు. రెండో డోసు తీసుకున్న వారిలో 695 మందికి మాత్రమే కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.
మొత్తం మీద రెండు డోసులు తీసుకున్న వారిలో కొవిడ్ బారిన పడుతున్నవారు 0.04 శాతం. ఇక సీరమ్ ఇన్స్టిట్యూట్ ఉత్పత్తి చేస్తున్న కొవిషీల్డ్ వ్యాక్సిన్ విషయానికి వస్తే.. 11.6 కోట్ల మంది ఇప్పటి వరకు కొవిషీల్డ్ తీసుకోగా.. తొలి డోసు తీసుకున్న 10 కోట్ల మందిలో 17,145 మందికి కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. రెండు డోసులూ తీసుకున్న కోటిన్నర మందిలో 5,014 మంది కొవిడ్ బారిన పడ్డారు. దీని ప్రకారం కొవిషీల్డ్ రెండు డోసులూ తీసుకున్న మొత్తం జనాభాలో 0.03 శాతం మంది. ఇవీ.. టీకాలు తీసుకున్నా కోవిడ్ బారిన పడిన వ్యక్తుల లెక్కలు.