ఈ బ్యాంకులో అకౌంట్ ఉందా.. అయితే మీకే ఈ గుడ్ న్యూస్..?

praveen
రోజురోజుకు టెక్నాలజీ పెరిగిపోతున్న నేపథ్యంలో అటు బ్యాంకింగ్ రంగం లోని అన్ని రకాల బ్యాంకులు కూడా తమ కస్టమర్లకు ఎప్పటికప్పుడు టెక్నాలజీకి అనుగుణంగా వినూత్నమైన సర్వీసులు అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. అదే సమయంలో బ్యాంకింగ్ రంగంలో ఉన్న పోటీని తట్టుకుంటూ కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. ప్రభుత్వ ప్రైవేటు రంగ బ్యాంకులు అనే తేడా లేకుండా అన్ని బ్యాంకులు కూడా తమ కస్టమర్లకు మెరుగైన సర్వీసులు అందించేందుకు ఎప్పటికప్పుడు ముందుకు వస్తూనే ఉన్నాయి.


 ఈ క్రమంలోనే ఒకప్పుడు బ్యాంకుకు వెళితే కానీ జరగని పనులు అన్నీ కూడా ఇక ఇప్పుడూ ఇంట్లో కూర్చుని చేసుకుంటున్నారు ప్రతి ఒక్కరు. అయితే ఇటీవలే కస్టమర్లకు ప్రయోజనం చేకూరే విధంగా కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వ రంగ రెండో అతిపెద్ద బ్యాంకింగ్ సంస్థ పంజాబ్ నేషనల్ బ్యాంక్ తమ కస్టమర్లకు శుభవార్త చెప్పింది. సరికొత్త సర్వీస్ను అందుబాటులోకి తీసుకువచ్చింది పంజాబ్ నేషనల్ బ్యాంక్. అయితే ఇక ఈ సరికొత్త సర్వీసుల ద్వారా ఇప్పటివరకు బ్యాంకులకు వెళ్లి సేవలను పొందిన కస్టమర్లు స్వతహాగా చేసుకునేందుకు అవకాశం ఉంటుంది . సేవింగ్స్ అకౌంట్ ఓపెనింగ్ దగ్గర నుంచి రుణాలు పొందే సేవలు వరకు కూడా పొందవచ్చు.



 బ్యాంకు కు వెళ్లకుండానే ఏ ఉద్యోగితో పనిలేకుండానే ఈ సర్వీసును పొందేందుకు అవకాశం ఉంటుంది. దేశవ్యాప్తంగా ఉన్న 165 ప్రాంతాలలో కూడా పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఈ సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. వీటిల్లో ఏటీఎం కియోస్క్, నోట్ యాక్సెప్టర్ కియోస్క్, అకౌంట్ ఓపెనింగ్ కియోస్క్, కార్డ్ ఇష్యూయెన్స్ కియోస్క్, ఇంటర్నెట్ ఎన్‌ఏబుల్ కియోస్క్ అనే ఐదు రకాల కియోస్క్ ఉంటాయి. వీటి ద్వారా కస్టమర్లు బ్యాంకింగ్ సేవలను ఒకే చోటు పొందొచ్చని పీఎన్‌బీ తెలిపింది. ప్రస్తుతం కరోనా వైరస్ పరిస్థితుల్లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ కస్టమర్లు అందరికీ ఇది ఒక గొప్ప శుభవార్త అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: