తిరుపతిలో సానుభూతి ఎత్తు.. చివరికి ఎవరు చిత్తవుతారో..?
ఇకపోతే ప్రస్తుతం తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక నేపథ్యంలో ఒక్కో పార్టీ ఒక్కో వ్యూహంతో ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా అయితే అన్ని పార్టీలు కూడా సానుభూతితో ఓట్లు సాధించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం అధికార పార్టీ గా ఉన్న వైసిపి వైరస్ చికిత్స ను ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందని ఎన్నో పథకాలను కూడా ప్రవేశపెట్టింది క్లిష్టపరిస్థితుల్లో ప్రభుత్వం సుపరి పాలన అందిస్తోంది అనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకుని ఇక సానుభూతితో ఓట్లు సాధించాలని భావిస్తున్నట్టు విశ్లేషకులు అంటున్నారు.
అదే సమయంలో జగన్ అహంకారాన్ని తగ్గించాలి అంటే తమ వల్లే సాధ్యమవుతుందని ప్రజలందరూ తమకు ఓటు వేసి గెలిపించాలని అప్పుడైతే ప్రజలందరికీ సుపరిపాలన అందే విధంగా పోరాటం చేస్తామంటూ ప్రస్తుతం ప్రతిపక్ష టిడిపి పార్టీ ప్రజల్లోకి దూసుకుపోతుంది. అదే సమయంలో ఇక బీజేపీ జనసేన పవన్ కళ్యాణ్ ను ముందు ఉంచి జనంలో ప్రచారం నిర్వహిస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. పవన్కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ వైసీపీ పార్టీ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందని పట్టిపీడిస్తోంది అంటూ జనంలోకి బిజెపి తీసుకెళ్తున్నట్లు సమాచారం. ఇలా మూడు పార్టీలు కూడా ప్రజల సానుభూతిని క్యాష్ చేసుకుని ఓట్లు సాధించేలా పావులు కదుపుతున్నట్లు చెబుతున్నారు విశ్లేషకులు. ఏం జరుగుతుందో చూడాలి మరి.