పవన్ కల్యాణ్.. అవన్నీ అలా ఎలా మరిచిపోయారో..?
వైసీపీ సంగతి పక్కకు పెడితే.. వెంకన్న సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన సభలో నరేంద్ర మోడీ, వెంకయ్య నాయుడు, చంద్రబాబు నాయుడులతో పాటు పవన్ కళ్యాణ్ ఉన్నారు. కాని దానిని మోడీ ఎగ వేశారు. బిజెపి పాచిపోయిన లడ్లు ఇచ్చిందని ప్యాకేజీ ప్రకటన సమయంలో పవన్ విమర్శించారు. మరి తిరుపతి సాక్షిగా పాచిన లడ్డు పవన్ ఎవరికి ఇచ్చారో తెలియదు. పవన్ వాదన కరెక్టు అనుకుంటే ఏపీ ప్రజలకు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి మాట తప్పిన బిజెపి, జనసేన, టిడిపిలకు ఓటు వేయకూడదు. వారికి ఓటు వేస్తే తిరుపతి వెంకన్నకు ద్రోహం చేసినట్లు అవుతుంది.
కానీ.. పవన్ కళ్యాణ్ దీని గురించి ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు. వైసీపీ సంగతి పక్కకు పెడితే.. ప్రత్యేక హోదాపై బిజెపిని నిలదీస్తారో లేదో పవన్ ఇప్పటి వరకూ క్లారిటీ ఇవ్వలేదు. 150 గుడులను వైసిపి పాలనలో కూల్చారని పవన్ అంటున్నారు. చంద్రబాబు హయాంలో కూల్చిన గుడుల గురించి మాత్రం పవన్ కల్యాణ్ మాట్లాడరు. అంతే కాదు.. శ్రీకృష్ణదేవ రాయలు బ్రిటిష్ వారితో పోరాడారని పవన్ కళ్యాణ్ అన్నట్టు వార్తలు వచ్చాయి. అదే నిజమైతే ఆయన చరిత్ర పరిజ్ఞానంపై కూడా అనుమానాలు ఏర్పడతాయి.
ఇంకో కాంట్రావర్సీ ఏంటంటే.. చంద్రబాబు తరహాలోనే పవన్ కూడా పులివెందుల ప్రజలను అవమానించేలా మాట్లాడుతున్నారు. అయితే పులివెందుల నుంచి కూడా ఎందరో స్ఫూర్తిప్రదాతలు వచ్చారు. ఇలా ప్రాంతాన్ని అవమానించడం సరికాదని పవన్ తెలుసుకోవాలి.