తిరుపతి ఎన్నికల ప్రచారానికి జగన్ రాకపోవడానికి కారణం ఇదేనా...?

VAMSI
ఏపీలో ప్రస్తుతం అన్ని రాజకీయ పార్టీల చూపు తిరుపతి ఎంపీ ఉప ఎన్నికల మీదే కేంద్రీకృతం అయి ఉంది. ఇందులో భాగంగానే ఒకపక్క టీడీపీ నాయకుడు లోకేష్ తమ పార్టీని గెలిపించుకోవడం కోసం తెగ తిరుగుతున్నారు. మరోవైపు అధికార వైసీపీకి చెందిన 20 మంది మంత్రులు అక్కడ కాన్సంట్రేట్ చేసి అంత చూసుకుంటున్నారు. అయితే ఇక్కడ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తిరుపతికి  వస్తారా లేదా అన్నది ఇక్కడ కీ పాయింట్. మొన్న ఈ మధ్య జరిగిన ఎన్నికలు వేరు, ఇపుడు పతాక స్థాయికి ప్రచారం జరుగుతున్నటువంటి సందర్భం వేరు. తిరుపతికి లోకేష్ తో పాటుగా బాలకృష్ణ కూడాస వచ్చే అవకాశం ఉంది.  కానీ సీఎం జగ్మోహన్ రెడ్డి వచ్చారంటే ఇక్కడ జరగాల్సిన కార్యక్రమాలను పూర్తిగా స్థానిక నాయకులకు లేదంటే, మంత్రులకు అప్పచెప్పడం అన్నటువంటిది ఇక్కడ కీలకమైంది. 


ఇదే ప్రస్తుతం జరుగుతున్న  పెద్ద చర్చ పాతకాలపు కాంగ్రెస్ వ్యవహార శైలిని జగన్ గారు అనుసరిస్తున్నారు అన్న భావన వ్యక్తమవుతోంది. అప్పట్లో ఒక ముఖ్య మంత్రి బయటకు రావడం అంటే చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఒక మూడు నాలుగు జిల్లాల ప్రధాన కార్యదర్శిలు అక్కడకు వెళ్లి సీఎం ని కలిస్తే చర్చ జరిగేది. అయితే ఆ పరిస్థితిని మార్చింది చంద్రబాబు నాయుడు. అప్పట్లో ఈయన కార్పొరేట్ కౌన్సిలర్ కంటే ఎక్కువ తిరిగేవారు. వాస్తవానికి ఇదే ఆయనను సుదీర్ఘ కాలం నిలబెట్టింది. ఆ తర్వాత చంద్రన్నను గద్దె దించడానికి రాజశేఖర్ రెడ్డి సైతం ఊరు వాడ తిరిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యాక కూడా ఆగలేదు. అలానే ఆయన ప్రజా యాత్ర కొనసాగించారు.


రాజశేఖర్ రెడ్డి తరువాత వచ్చిన రోశయ్య  సైతం తిరగాల్సొచ్చింది. ఆ తర్వాత వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి ఆగలేదు. అయితే ఒక్క వైయస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రమే అప్పుడప్పుడు జనాల మధ్య బయట కనపడుతుంటారు అన్నది ప్రస్తుత వాదన. అలాంటి సందర్భంలో జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ పాతకాలపు రోజులకు ప్రాధాన్యం ఇస్తూ, ఇప్పుడు అదేపద్ధతిని ఫాలో అవుతున్నారా అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.. లేదా ఈ చర్చకు పుల్ స్టాప్ పెట్టి ప్రజల మధ్యలో ఊరూరా తిరుగుతారా అన్నది ప్రశ్న. ఏమి జరగనుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: