టూత్ బ్రష్ ను ఎన్ని రోజులకు మార్చాలో తెలుసా.. అలా వాడితే అస్సలు మంచిది కాదు..?
ఇక ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన డిజైన్ లో ఉన్న టూత్ బ్రష్ వాడటానికి ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. అయితే ప్రతి రోజూ ఉదయాన్నే రోజూ వాడే సాధనం గా మారిపోయిన టూత్ బ్రష్ విషయంలో చాలామంది అజాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటారు. కొంతమంది టూత్ బ్రష్ ను నెలల తరబడి వాడుతూ ఉంటారు. అయితే ఆ టూత్ బ్రష్ పూర్తిగా అరిగిపోయి నప్పటికీ కూడా వదలకుండా అదే టూత్ బ్రష్ తో దంతాలను క్లీన్ చేసుకుంటూ ఉంటారు ఎంతో మంది. అయితే టూత్ బ్రష్ ని ఎన్ని రోజుల వరకు వాడాలి అనే విషయం మాత్రం చాలా మందికి తెలియదు.
అందుకే ఎంతోమంది టూత్ బ్రష్ అరిగిపోయి విరిగిపోయే దాకా కూడా వదలకుండా వాడేస్తూ ఉంటారు. అయితే టూత్ బ్రష్ కి కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది అన్నది చాలామందికి తెలియదు. సాధారణంగా అయితే మూడు నెలలకు ఒకసారి టూత్ బ్రష్ మారుస్తూ ఉండాలి అని నిపుణులు చెబుతున్నారు. నిర్లక్ష్యంగా అలాగే వాడితే టూత్ బ్రష్ ఎన్నో అనారోగ్య సమస్యలకు కారణమవుతోంది అని హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా బ్రష్ చేసే ముందు టూత్ బ్రష్ ను తప్పనిసరిగా కడగాలి అని చెబుతున్నారు. ఇక మీ టూత్ బ్రష్ ను వేరే వాళ్ళు వాడిన సమయంలో దానిని క్లిక్ చేసి మళ్లీ వాడటం లాంటివి అసలు చేయవద్దు అని చెబుతున్నారు నిపుణులు.