నిమ్మగడ్డకు టైమ్ ఫిక్స్ చేశారా?

M N Amaleswara rao


ఎట్టకేలకు ఏపీలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ హడావిడి తగ్గింది. మొన్నటివరకు ఎలక్షన్ కమిషనర్‌గా ఉన్న నిమ్మగడ్డ, ఏపీ ప్రభుత్వంల మధ్య ఎలాంటి యుద్ధం జరిగిందో అందరికీ తెలిసిందే. గత ఏడాది నుంచి వీరి మధ్య జరిగిన రచ్చ ఏంటో అంతా చూశారు. ఇక చివరిగా నిమ్మగడ్డ తాను అనుకున్న విధంగా పంచాయితీ, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించి రిటైర్ అయిపోయారు.


అయితే రిటైర్ అవ్వడానికి కాస్త సమయం ఉన్నా సరే నిమ్మగడ్డ ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి ఎన్నికలు మాత్రం నిర్వహించలేదు. ఎందుకంటే ఈ ఎన్నికలకు గత ఏడాదే నిమ్మగడ్డ నోటిఫికేషన్ ఇచ్చారు. అలాగే నామినేషన్స్ స్వీకరించారు. ఇక ఈ నామినేషన్స్ సమయంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య పెద్ద ఎత్తున గొడవలు జరిగాయి. అలాగే చరిత్రలో లేని విధంగా ఏకగ్రీవాలు అయ్యాయి.


వైసీపీ వాళ్ళు వేరే వాళ్ళని నామినేషన్స్ వేయనివ్వకుండా బెదిరించడంతోనే ఇన్ని ఏకగ్రీవాలు అయ్యాయని టీడీపీ నేతలు ఎప్పటినుంచో ఆరోపిస్తున్నారు. అలాగే ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి ఎన్నికలకు మళ్ళీ ఫ్రెష్ నోటిఫికేషన్ ఇవ్వాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. ఇక ఈ విషయంలో నిమ్మగడ్డ సైడ్ అయిపోయారు. ఎలాగో పంచాయితీ, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించారు కాబట్టి, నిమ్మగడ్డ ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి ఎన్నికలు నిర్వహించకుండా రిటైర్ అయిపోయారు.


అయితే నిమ్మగడ్డ ఏ నిర్ణయం తీసుకున్నా సరే అది జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఉండేది. ఇక ఈ విషయంలో వైసీపీ నేతలు నిమ్మగడ్డపై ఎలాంటి విమర్శలు చేశారో తెలిసిందే. ఏడాది కాలం నుంచి వైసీపీ నేతలు నిమ్మగడ్డపై విరుచుకుపడుతూనే ఉన్నారు. కాకపోతే నిమ్మగడ్డ రాజ్యాంగబద్దమైన పదవిలో ఉండటంతో వైసీపీ పాచికలు పారలేదు. ఇక ఇప్పుడు నిమ్మగడ్డ రిటైర్ అయ్యి, సామాన్య పౌరుడు అయ్యారు. దీంతో నిమ్మగడ్డని వైసీపీ ప్రభుత్వం ఎలాగైనా దెబ్బకొట్టొచ్చని తెలుస్తోంది. ఆయన్ని మళ్ళీ ఇబ్బంది పెట్టడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మరి చూడాలి నిమ్మగడ్డ ఎపిసోడ్ ఎప్పుడు ముగుస్తుందో.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: