వైసీపీ తిరుపతి పోరులో ఆ మాటే ఎత్తడం లేదా..? సేఫ్‌ గేమ్‌ ఆడుతోందా..?

Chakravarthi Kalyan
తిరుపతి ఉప ఎన్నిక విషయంలో వైసీపీ సేఫ్‌ గేమ్ ఆడుతోందా.. అనిపిస్తోంది. ఈ ఎన్నికల్లో వివాదాస్పద అంశాల జోలికి వైసీపీ వెళ్లడం లేదు. ఇప్పుడు వైసీపీ సేఫ్ గేమ్ ఆడుతోంది. అందుకే సంక్షేమాన్నే వైసీపీ నమ్ముకున్నట్టు కనిపిస్తోంది. ఇందుకు ఉదాహరణగా కొన్ని అంశాలు చెప్పుకోవచ్చు. మొదటిది ప్రత్యేక హోదా అంశం. గతంలో ఈ అంశాన్ని వైసీపీ ఎక్కువగా ప్రస్తావించేది ఎందుకంటే.. 2014 ఎన్నికల ప్రచారం సమయంలో మోడీ తిరుపతి వచ్చి మరీ ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని భరోసా ఇచ్చారు. గతంలో ఈ అంశాన్ని వైసీపీ బాగా ప్రస్తావించేది.  


కానీ ఈసారి ఎక్కడా ప్రత్యేక హోదా ప్రస్తావన తీసుకురావడం లేదు. అలాగే.. మరో కీలక అంశం దేవుళ్ల అంశం. తిరుపతిపై బీజేపీ ఎక్కువగా ఫోకస్ చేస్తున్నా.. జగన్ పాలనలో ఆలయాలపై దాడి జరుగుతోందని బీజేపీ ప్రచారం చేస్తున్నా .. వైసీపీ మాత్రం ఆ అంశాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇందుకు కూడా కారణం ఉంది. ఎందుకంటే.. తిరుపతి పార్లమెంటరీ నియోజక వర్గంలో ఐదు నియోజక వర్గాల్లో ఎస్సీ ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఇలాంటి చోట పెద్దగా దేవుళ్ల అంశం వర్కవుట్ కాదని వైసీపీ భావిస్తున్నట్టు చెప్పుకోవచ్చు.


అంతే కాదు.. నిన్న మొన్నటి వరకూ టీడీపీ ఈ అంశాలపై నానా యాగీ చేసింది. కానీ ఆ తర్వాత ఆయా ప్రాంతాలన్నింటిలోనూ  వైసీపీ జయభేరి మోగించింది. అందుకే ఇక దేవుళ్ల అంశాలకు ఓట్లు రాలకపోవచ్చని వైసీపీ భావిస్తోంది. అందుకే ఎక్కువగా తన ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలనే వైసీపీ ఎక్కువగా నమ్ముకుంటోంది. చెప్పింది చేశాం.. చేసింది చెప్పుకుందాం అన్న ఆలోచన ఎక్కువగా వైసీపీ నాయకుల్లో కనిపిస్తోంది.


ఇక తిరుపతి ఉపఎన్నికల విషయంలో అభ్యర్థుల అంశంపై క్లారిటీ వచ్చేసింది. వైసీపీ నుంచి ఫిజియోథెరపిస్టు డాక్టర్ గురుమూర్తి బరిలో ఉన్నారు. టీడీపీ పనబాక లక్ష్మిని రంగంలోకి దింపింది. బీజేపీ కూడా  తన అభ్యర్థిని ప్రకటించింది. తిరుపతి పార్లమెంట్ అభ్యర్థినిగా  రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని కె.రత్నప్రభను ఆ పార్టీ ప్రకటించింది. అన్ని పార్టీలు తమ వంతు ప్రయత్నాలు ప్రారంభించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: