కరోనా కట్టడికి జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. ఇక అవన్నీ బంద్..?

praveen
మొన్నటి వరకు దేశంలో కరోనా వైరస్ కలకలం సృష్టించింది. అయితే ఆ తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు  వైరస్ ను కంట్రోల్ చేయడంలో ఎంతో శ్రమించి చివరికి కంట్రోల్ చేయడంలో విజయం సాధించాయి. ఈ క్రమంలోనే దేశ ప్రజానీకం మొత్తం  వైరస్ కంట్రోల్ అయ్యిందని సంతోష పడుతున్న తరుణంలో మరోసారి దేశంలో  వైరస్ కేసులు అంతకంతకూ పెరిగి పోతు ఉండటం ప్రజలందరినీ ఆందోళన కలిగిస్తుంది. ప్రభుత్వాలకు కూడా ఇది పెద్ద సవాలుగా మారిపోయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మొన్నటి వరకు కొన్ని రాష్ట్రాలలో కేవలం పదుల సంఖ్యలో మాత్రమే నమోదైన  కేసులు పదుల నుంచి 100 లోకి వందల నుంచి వేల లోకి చేరిపోతున్నాయి..  ఈ క్రమంలోనే ఇక అటు ప్రభుత్వం  వైరస్ కట్టడికి ఒకప్పటిలా కాకుండా ప్రస్తుతం ఎంతో త్వరగా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతోంది.


 ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటూ ముందుకు సాగుతుంది అన్న విషయం తెలిసిందే.   వైరస్ కంట్రోల్ చేయడంలో  భాగంగా ఇటీవలే ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లోని పలు ఆలయాలలో నిత్య అన్నదాన కార్యక్రమం కొనసాగుతోంది. నిత్య అన్నదాన విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం.  దాదాపుగా అన్ని ఆలయాలలో నిత్య అన్నదాన కార్యక్రమాన్ని నిలిపి వేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక అన్నదాన కార్యక్రమం అంటే అక్కడ ఎక్కువగా గుమి గూడి ప్రజలు ఉండే అవకాశం ఉంది అంతే కాకుండా వారిని కంట్రోల్ చేయడం దాదాపు అసాధ్యం అని చెప్పవచ్చు.



 ఇలాంటి తరుణంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోతే రానున్న రోజుల్లో మరింత దారుణంగా  వైరస్ కేసులు పెరిగే అవకాశం ఉంది అని భావించిన ప్రభుత్వం అన్నదాన కార్యక్రమాన్ని నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది.  ఇక అన్నదాన కార్యక్రమం నిర్వహించకుండా అన్న దానంలో అందించే అన్ని రకాల ఆహార పదార్ధాలను కూడా పాకెట్ల రూపంలో క ప్రజలందరికీ అందించేందుకు నిర్ణయించింది.  ఇక ఆలయాలు కూడా మూసేస్తారా అనే భయం కూడా ప్రజల్లో నెలకొంది. అయితే ఆలయాల మూసివేయకుండా ఉండాలి అంటే అటు ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకోండి  వైరస్ ను కట్టడి చేయడంలో భాగస్వాములు కావాలని అలా జరగకుండా నిర్లక్ష్యం వహిస్తే ఆలయాల మూసివేత కూడా జరగడం ఖాయమని అంటున్నారు విశ్లేషకులు.  ఏదేమైనా  వైరస్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని అన్నదాన కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేయడం మాత్రం ఒక శుభపరిణామం అని అంటున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: