అలా చనిపోతే భీమా వర్తించదు.. గుర్తుంచుకోండి..?

praveen
ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరి జీవితంలో ఇన్సూరెన్స్ అనేది సర్వసాధారణంగా మారిపోయింది. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరు కూడా వివిధ రకాల ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఇలా ఇన్సూరెన్స్ తీసుకోవడం ద్వారా ఏదైనా ప్రమాదం బారిన పడి వారు చనిపోతే ఇక వారి కుటుంబీకులకు ఇన్సూరెన్స్ మొత్తాన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు అందిస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే ఇక సదరు వ్యక్తి చనిపోయినప్పటికీ  వారి కుటుంబ సభ్యులకు మాత్రం ఆర్థిక సహాయం అందిస్తూ ఉంటుంది.


 అయితే రోడ్డు ప్రమాదాలు జరిగి చనిపోవడం లేదా ఇతర కారణాల వల్ల ప్రాణాలు కోల్పోయిన సమయంలో ఇన్సూరెన్స్ వర్తిస్తూ ఉంటుంది అనే విషయం తెలిసిందే.  కానీ తాగి చనిపోయిన సమయంలో ఇన్సూరెన్స్ వర్తించదు అనే విషయాన్ని ఇటీవల సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కేవలం ప్రమాదంలో మరణిస్తే తప్ప ఇలాంటి సందర్భాల్లో పరిహారం ఇవ్వాల్సిన అవసరం లేదు అంటూ ఇటీవల సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఇక సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార సంఘం కూడా సమర్థించడం  గమనార్హం.



 అయితే సుప్రీం కోర్టు ఈ తీర్పు ఇవ్వడానికి వెనుక పెద్ద కారణమే ఉందని తెలుస్తోంది. హిమాచల్ ప్రదేశ్ సిమ్లా లోని చౌపాల్ పంచాయతీలో అటవీ సంస్థలో పనిచేస్తున్న ఓ వ్యక్తి 1997 లో కురిసిన భారీ వర్షాల కారణంగా ప్రాణాలు కోల్పోయినట్లు వారి కుటుంబ సభ్యులు అధికారులకు ఫిర్యాదు చేశారు.అయితే పరీక్ష నిర్వహించగా ఆయన ఒంటిపై ఎలాంటి గాయాలూ లేవు.అతిగా మద్యం తాగడం వళ్లే చనిపోయాడు అన్నది తేలింది. అయితే ఇలా మద్యం తాగడం వల్ల ప్రాణాలు కోల్పోయినట్టు తేలితే ప్రమాదం కానందున పరిహారం చెల్లించబోము కంపెనీ చెప్పడంతో వినియోగదారుల ఫోరంకు ఫిర్యాదు చేయగా వారికి అనుకూలంగా తీర్పు వెలువరించింది. ఈ క్రమంలోనే ఈ విషయానికి సంబంధించి సుప్రీంకోర్టులో అప్పీలు చేయగా ఇక పరిహారం చెల్లించాల్సిన బాధ్యత ఇన్సూరెన్స్ సంస్థకు లేదు అని స్పష్టం చేసింది సుప్రీం కోర్టు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: