బాబు అట్టర్ ఫ్లాప్.. ఇక పనికిరాడు.. తేల్చిపారేసిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ..!
ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణకు జగన్ అంటే ఎంత ద్వేషమో అందరికీ తెలిసిందే. ఈ విషయాన్ని ఆయన ఏమీ దాచుకోడు.. ఇక ఆంధ్రజ్యోతి దిన పత్రిక వైఖరి ఏంటో పాఠకులకు బాగానే తెలుసు..ఈ విషయం బహిరంగ రహస్యమే. అలాగే ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ చంద్రబాబు అనుకూలుడన్న పేరు బాగా ఉంది. అందుకే ఆయన తన పత్రికలో ఎక్కువగా వైసీపీని టార్గెట్ చేస్తుంటారు.. అలాగే కొందరు వైసీపీ నేతలు ఆంధ్రజ్యోతి చంద్రజ్యోతి అంటూ కామెంట్ చేస్తుంటారు.
అయితే అప్పుడప్పడు రాధాకృష్ణ నిజాలు కూడా రాస్తుంటారని విశ్లేషకులు సెటైర్లు వేస్తుంటారు. తాజాగా ఆయన రాసిన కొత్త పలుకు మాత్రం చంద్రబాబుకు షాకింగ్ అనే చెప్పాలి. ఇంతకీ రాధాకృష్ణ ఏం రాశారంటే.. గుంటూరు నగర పాలక సంస్థలో ‘‘మాకు ఒక పది డివిజన్లు వదిలేయండి. మిగతాచోట్ల మేం బలహీనులనే పోటీకి పెడతాం’అని తెలుగుదేశం నాయకులే అధికార పార్టీ వారితో రాజీ కుదుర్చుకున్నారట. అందుకే పోటీ చేసిన పది డివిజన్లలో తొమ్మిది గెలుచుకున్నారట. విశాఖపట్నంలో నాయకుల వైఫల్యం, లాలూచీ కారణంగానే నగర పాలక సంస్థ చేజారిందట. ఓటేయడానికి విశాఖ వాసులు సిద్ధంగా ఉన్నప్పటికీ వారిలో భరోసా కల్పించే నాయకుడు లేకుండా పోయాడట.
అసలు తన తరఫున ప్రజలే పోరాడాలని కోరుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు రాధాకృష్ణ. అధికార పార్టీ నుంచి తమకు వేధింపులు ఎదురుకాకుండా నాయకులు రాజీ పడుతుంటే కార్యకర్తలు మాత్రం సర్వం ఒడ్డి పోరాటం చేయాలని కోరడం ఏమి న్యాయం? అని నిలదీస్తున్నారు. అంతే కాదు.. కీలక సమయాల్లో పార్టీ అధినేత తమకు అండగా ఉంటారన్న నమ్మకం ఆయనపై పార్టీ నాయకులకు లేదట. తనపై నమ్మకం లేకుండా చంద్రబాబే చేసుకున్నారట. టీడీపీకి ఇప్పుడు కొత్త రక్తం అవసరమట.