పోలీసులకు ఝలక్ ఇచ్చిన మందుబాబు.. దేవుడా..!

Satvika
జంట నగరాల్లో ఒకవైపు కరోనా పెరుగుతుంది.. మరోవైపు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు కూడా పెరుగుతున్నాయి.. మద్యం సేవించి వాహనం నడపరాదని ట్రాఫిక్ పోలీసులు ఎంతగా మొత్తుకున్నా కూడా మందుబాబులు మాత్రం ఎక్కడా తగ్గట్లేదు.. అంతకు మించి తాగుతున్నారు. పోలీసుల కంట పడుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ లో ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్న అధికారులకు కొన్ని సార్లు అనుకొని ఘటనలు ఎదురుకావడంతో చూస్తుంటాం..

ఇప్పుడు కూడా అలాంటి ఘటనే ఎదురైంది..కొందరు మందుబాబులు పోలీసులకు సహకరించకుండా రచ్చ చేస్తున్నారు. మద్యం మత్తులో వారికి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్‌లో దొరకకుండా ఉండేందుకు వింతగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ఓ మందు బాబు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు చుక్కలు చూపించాడు. వారికి సహకరించకుండా గంటపాటు ఇబ్బంది పెట్టాడు. వివరాలు.. నారాయణగూడ పాత దీపక్ థియేటర్ వద్ద శుక్రవారం రాత్రి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు.

వైఎంసీఏ నుంచి చిక్కడపల్లికి వెళ్లే మార్గంలో నారాయణగూడ, అబిడ్స్ తనిఖీలను నిర్వహించారు. ఆ సమయంలో ఆ మార్గం కూడా ద్వారా వచ్చిన ఓ బైకర్ నన్ను ఎందుకు ఆపారు అంటూ పోలీసుల పై చిందులు తొక్కాడు.డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే ఓ కానిస్టేబుల్ బ్రీత్ ఎనలైజర్‌ తీసుకొచ్చి అతడిని ఊదమని కోరాడు. అయితే అప్పటిగే మద్యం సేవించి ఉన్న అతడు.. బ్రీత్ ఎనలైజర్‌లోకి గాలి ఉదకుండా తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. లోపలికి గాలి పీల్చుకుంటూ తాను తాగలేదని బుకాయించాడు. దీంతో పోలీసులు ఎనలైజర్‌కు పైప్‌ను ఏర్పాటు చేసి అతని నోట్లో పెట్టారు. దాదాపు గంట పాటు పోలీసులకు చుక్కలు చూపించాడు.గాలి ఊదడంతో.. బ్రీత్ ఎనలైజర్‌లో 100 పాయింట్లు చూపించింది. ఇక, అతడు మద్యం తాగినట్టు తేలడంతో అతని బైక్ ను స్వాధీనం చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: