మంత్రి రాసలీలల సీడి కేసులో మరో మలుపు..

Satvika
కర్ణాటక లో గత కొద్ది రోజులుగా సంచలనంగా మారిన ఘటన మంత్రి రాసలీల వీడియో బయటకు రావడం.. ఉద్యోగం కోసం అతని దగ్గరకు వెళితే అతను గడపన్నాడు అంటూ యువతి ఫిర్యాదు చేసింది. అనంతరం యువతి మాయం అయ్యింది. ఆమె ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. చివరికి ఆమె ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఆమె లొకేషన్ ను పట్టుకున్నారు.ఆ సీడీ వ్యవహారం పెద్ద చర్చనీయాంశం కావడంతో ఆమె కొన్నిరోజులు ఢిల్లీ, గోవాలో ఉన్నట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఆమెను త్వరలోనే అదుపులోకి తీసుకుని విచారణ చేపడతామని సిట్ అధికారులు ప్రకటించారు.

ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కొందరితో కలిసి ఆమె ఢిల్లీలో ఉన్నట్లు తాజాగా తెలిసిందని పోలీసు ప్రత్యేక బృందాలు తెలిపాయి. దీంతో కొన్ని బృందాలు అక్కడికి వెళ్లాయని సిట్ తెలిపింది. సదరు యువతికి సిట్ ఇప్పటికే మూడోసారి నోటీసులు పంపింది.సీడీ వ్యవహారాన్ని బహిరంగం చేసిన సామాజిక కార్యకర్త దినేష్ కల్లహళ్లి కేసును ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించిన సమయంలో 4 పేజీల సుదీర్ఘ వివరణ ఇచ్చారు. యువతి ప్రాణభయంతో ఉందని, బహిరంగం చేసేలా కేసు పెడితే ఆమెకు రక్షణ కల్పించినట్టు అవుతుందన్న ఉద్దేశంతోనే ఫిర్యాదు చేశానని కల్లహళ్ళి తన వివరణలో స్పష్టం చేశారు.. ఇకపోతే గత కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ లో ఉన్నట్లు గుర్తించారు.

కాగా, ఈ విషయం పై పోలీసులు మాత్రం గాలింపు చేస్తున్నారు.సీడీలో ఉన్న యువతి పట్టుబడితే గానీ కేసులో వాస్తవాలేంటనే విషయంలో ఓ క్లారిటీ వచ్చేలా లేదు. తాను అమాయకుడినని, తనకూ.. ఆ వీడియోకు ఎలాంటి సంబంధం లేదని మాజీ మంత్రి జార్కిహొళి ఇప్పటికే ప్రకటించారు. ఇదిలా ఉంటే.. యువతి తండ్రి ఫిర్యాదును ఆర్‌టీ నగర్ పోలీస్ స్టేషన్‌కు మార్పు చేశారు. ఈ మేరకు ఆర్‌టీ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ దాఖలైంది.. ఈ కేసులో అనుమానితుడు గా ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అతని వద్ద నుంచి భారీగా బంగారాన్ని, ల్యాప్ టాప్,పెన్ డ్రైవ్ లను స్వాధీనం చేసుకున్నారు. యువతి దొరికే లోపు ఇంకెంతమంది ఆరోపణలు ఎదుర్కుంటారో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: