శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. టిటిడి బోర్డు కీలక నిర్ణయం..?

praveen
దేశంలోని ప్రముఖ ఆలయాలలో ఒకటైన తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎప్పుడూ భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంటుంది అన్న విషయం తెలిసిందే.కాలంతో సంబంధం లేకుండా దేశం నలుమూలల నుంచి భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు తరలివస్తున్నారు. ఇక ఏడుకొండలపై వెలసిన శ్రీ వేంకటేశ్వర స్వామి దివ్య రూపాన్ని దర్శించుకుంటే చాలు  ఇక జన్మ ధన్యం అయిపోయినట్లే అని భావిస్తూ ఉంటారు భక్తులు. అందుకే కాలంతో సంబంధం లేకుండా స్వామివారిని దర్శించుకునేందుకు తరలివస్తు అంటారు. అయితే గతంలో కరోనా వైరస్ కారణంగా ఇక ఎన్నడూ లేని విధంగా తిరుపతి ఆలయాన్ని కొన్ని రోజులపాటు మూసివేయాల్సి పరిస్థితి ఏర్పడింది అన్న విషయం తెలిసిందే.



 దీంతో శ్రీవారి భక్తులు అందరూ తీవ్ర ఆందోళన చెందారు. ఇక ఆ తర్వాత అన్లాక్ మార్గదర్శకాల లో భాగంగా కేవలం కొంత మంది భక్తులకు మాత్రమే  దర్శన భాగ్యాన్ని కలిగిస్తు టిటిడి బోర్డు అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే రోజురోజుకు పెరిగిపోతున్న భక్తుల రద్దీ దృష్ట్యా భక్తుల దర్శన టిక్కెట్లను కూడా ఎక్కువగా విడుదల చేసేందుకు టిటిడి బోర్డు అధికారులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.  ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం తగ్గిన నేపథ్యంలో భక్తుల తాకిడి మరింతగా పెరిగిపోయింది. ఈ క్రమంలోనే ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది టీటీడీ బోర్డు.


 తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శనం ఆన్లైన్ టికెట్ లను ఇటీవలే ఉదయం ఎనిమిది గంటల నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసింది. ఏప్రిల్ నెలకు సంబంధించిన 300 రూపాయల ప్రత్యేక దర్శనం టోకెన్లను టీటీడీ ఆన్లైన్ లో భక్తులకు అందుబాటులో ఉంచింది. ఏకంగా 25 వేల టిక్కెట్లు బుక్ చేసుకునేందుకు వీలు కల్పించింది టిటిడి బోర్డు. ఇక వీటితో పాటు వచ్చే నెలకు సంబంధించి తిరుమల తిరుపతిలోని గదులు బుకింగ్ కోటాను కూడా ఇవాళ మధ్యాహ్నం ఆన్లైన్లో అందుబాటులో ఉంచనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు టికెట్లు బుక్ చేసుకోవడానికి ఎంతగానో ఆసక్తి చూపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: