దేశంలోని పార్టీల ఆస్తులు ఇవే..

SRISHIVA
2018-19 సంవత్సరానికిగాను దేశంలో టాప్‌ 10 పార్టీలతో కూడిన జాబితాను ది అసోసియేషన్‌ ఆఫ్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్‌(ఏడీఆర్‌) విడుదల చేసింది. ఈ జాబితాలో  బీజేపీ 2,904.18 కోట్ల ఆస్తులను ప్రకటించింది. జాతీయ పార్టీలు వెల్లడించిన ఆస్తుల్లో ఇది 54.29 శాతం. కాంగ్రెస్‌ రూ.928.24 కోట్ల ఆస్తులున్నట్లు ప్రకటించింది. దేశంలో అత్యంత ఎక్కువ ఆస్తులున్న పార్టీ సమాజ్‌వాదీనే. ఆ పార్టీ.. రూ.572 కోట్లతో అగ్రస్థానంలో ఉండగా... ఒడిషాలో అధికారంలో ఉన్న నవీన్‌ పట్నాయక్‌ సారథ్యంలోని బీజేడీ రూ.232 కోట్లతో 2వ స్థానంలో ఉంది. తమిళనాడుకు చెందిన ఏఐఏడీఎంకే రూ.206 కోట్లతో మూ డో స్థానంలో నిలిచింది.

దేశంలోని ధనిక ప్రాంతీయ పార్టీల జాబితాలో తెలుగు రాష్ట్రాల్లోని పార్టీలు టాప్ టెన్ లో నిలిచాయి. టీడీపీ, టీఆర్‌ఎస్‌, వైసీపీలకు ఈ జాబితాలో చోటు దక్కింది. రూ.193 కోట్ల ఆస్తులతో టీడీపీ నాలుగో స్థానంలో, రూ.188 కోట్ల ఆస్తులతో టీఆర్‌ఎస్‌ ఆరో స్థానంలో, రూ.93 కోట్ల ఆస్తులతో వైసీపీ 8వ స్థానంలో నిలిచాయి. టీడీపీకి రూ.115 కోట్లు, టీఆర్‌ఎ్‌సకు రూ.152 కోట్లు, వైసీపీకి రూ.79 కోట్ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు ఉన్నాయి. ప్రాతీయ పార్టీలలో, తెలుగు పార్టీలు ‘గౌరవప్రద’ స్థానం ‘సంపాదించు’ కున్నాయి.

కేంద్ర ఎన్నికల సంఘం లెక్క ప్రకారం దేశంలో ఎనిమిది జాతీయ పార్టీలు,  ఓ ఫిఫ్టీ దాకా గుర్తింపు పొందిన ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. జాతీయ పార్టీలుగా గుర్తింపు పొందిన పార్టీలలో సిపిఐ,టీఎంసీ,ఎన్సీపీల జాతీయ హోదా త్రిశంకు స్వర్గంలో తేలియాడుతోంది. ఈ మూడు పార్టీలకు జాతీయ హోదా ఉపసంహరిచుకోమని కేంద్ర ఎన్నికల సంఘం 2019లోనే నోటీసులు ఇచ్చింది. అయితే ఇంకా అధికారికంగా ఆ పార్టీల  జాతీయ హోదా రద్దు కాలేదు కాబట్టి వాటి హోదా కొనసాగుతోంది. ఆప్ నుంచి ఎస్పీ దాకా, ఎంఐఎం నుంచి డీఎంకే, అన్నాడీఎంకే దాకా, బిజు జనతాదళ్ నుంచి జనతా దళ్ (ఎస్), జనతాదళ్ (యూ)వరకు మొత్తం ఓ 48 గిర్తింపు పొందిన ప్రాతీయ పార్టీ లున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: