పటికబెల్లం ఎందుకు తప్పనిసరిగా వాడాలి..!?
మనల్నిని దగ్గు, జలుబూ పెద్దవాళ్లను బాగా ఇబ్బంది పెడతాయి. అలాంటి సమస్య ఉంటే నల్ల మిరియాల పడి, తేనె, పటికబెల్లం పొడిని బాగా కలిపి పేస్టులా చెయ్యండి. దాన్ని రాత్రివేళ తినండి. మంచి ఫలితం ఉంటుంది. ఉదయంవేళ నల్ల మిరియాల పొడి, పటికబెల్లం పొడిని గోరువెచ్చటి నీటిలో కలిపి తీసుకున్నా ఆరోగ్యం మెరుగవుతుంది.
అయితే నోటికి రుచికరంగా ఉండటమే కాదు.. పటికబెల్లం మన బాడీని శక్తిమంతంగా చేస్తుంది. ఎంత పని చేసినా శక్తితో ఉండగలం. కొంత మందికి ముక్కు నుంచి రక్తం కారుతూ ఉంటుంది. వారు పటిక బెల్లం తరచూ వాడాలి. ఈ సమస్యను పటికబెల్లం వెంటనే పరిష్కరిస్తుంది. ఈ మధ్య అజీర్తి, మలబద్ధకం సమస్యలతో బాధపడేవారు పెరుగుతున్నారని డాక్టర్లు చెబుతున్నారు. పటికబెల్లం జీర్ణవ్యవస్థను సరిగా చేస్తుంది. ఏం తిన్నా ఆ తర్వాత పటికబెల్లం తీసుకుంటే చక్కగా అరిగిపోతాయి.
ఇక మనలో చాలా మందికి బాడీలో సరిపడా రక్తం ఉండదు. ఐరన్ తక్కువగా ఉంటుంది. అది ప్రమాదకరం. అందుకో మనం తరచూ పటికబెల్లం వాడుతూ ఉంటే.. రక్తంలో హిమోగ్లోబిన్ పరిమాణం పెరుగుతుంది. రక్త ప్రసరణ సరిగ్గా జరుగుతుంది. తద్వారా రక్తహీనత, నీరసం, అలసట, తల తిరగడం వంటి అనారోగ్యాలు రాకుండా ఉంటాయి. ఇలాంటి లక్షణాలు మీకు ఉంటే పటికబెల్లం వాడండి.