సీఎం జగన్ కు ఊహించని షాక్ ఇచ్చిన చెల్లి.. ఇప్పుడిదే హాట్ టాపిక్..?

praveen
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత వైయస్ వివేకానంద రెడ్డి హత్య ఆంధ్ర రాజకీయాలలో ఎంత సంచలనంగా మారిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అన్న విషయం తెలిసిందే. వైయస్ వివేకానంద రెడ్డి అయన  స్వంత నివాసంలోనే గుర్తు  తెలియని దుండగులు దారుణంగా హత్య చేయడం ఆంధ్ర రాజకీయాలను ఊపిసింది. ఇక ఆ తర్వాత ఇక రాష్ట్ర ప్రభుత్వం వివేకానంద హత్య కేసు విచారణను.. సిఐడి కి అప్పగించింది..  సీఐడి కి  అప్పగించిన తర్వాత అటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వివేకానంద హత్య కేసులో జగన్ హస్తం ఉంది అంటూ ప్రచారం చేయడం ఇక ఆ తర్వాత వివేకానంద కూతురు సునీత  జగన్ పై దుష్ప్రచారాలు ఆపాలంటూ చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది.



 అయితే ఒకప్పుడు ఇలా జగన్కు అండగా ఉన్న వివేకా కూతురు  ఇప్పుడు మాత్రం జగన్ తో అంతగా రాపో మెయింటెన్ చేయడం లేదు అన్నది అర్థం అవుతుంది. ఈ క్రమంలోనే ఇక షర్మిలకు ఎక్కువగా సన్నిహితంగా ఉండడమే కాదు ఇక మద్దతు కూడా తెలిపేందుకు  వివేకా  కూతురు సిద్ధమైనట్లు తెలుస్తోంది. వివేకానంద రెడ్డి వర్ధంతి కార్యక్రమంలో వివేకానంద రెడ్డి కూతురు తో పాటు షర్మిల కూడా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొనక  పోవడం గమనార్హం. ఇది ప్రస్తుతం అటు ఆంధ్ర తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారిపోయింది అని అంటున్నారు విశ్లేషకులు.


 అయితే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో సరికొత్త పార్టీని ప్రారంభించి ఇక తెలంగాణ రాష్ట్రంలో క్రియాశీలక రాజకీయ నేతగా ఎదగాలని అనుకుంటున్న షర్మిలకు ఇక ఇప్పుడు ఏకంగా సొంత ఫ్యామిలీ నుంచి సపోర్ట్ వస్తూ ఉండటంతో ప్రస్తుతం జగన్ కు భారీ షాక్ తగిలింది అని అంటున్నారు విశ్లేషకులు. మరి ఇక వివేకానంద కూతురు సునీత షర్మిలకు సపోర్ట్ చేస్తూ ఉండడంతో ఇక షర్మిల  రానున్న రోజుల్లో ఎలాంటి ముందడుగు వేయబోతుంది అన్నది కూడా ప్రస్తుతం ఆంధ్ర తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: