అఫిడవిట్‌లో కమల్ హాసన్ బయటపెట్టిన ఆస్తులు, విద్యార్హత తెలుసా..?
కమల్ హాసన్ పార్టీ పెట్టిన తర్వాత తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి దిగుతున్నారు. కోయంబత్తూర్ సౌత్ నుంచి తాను పోటీచేస్తున్నట్లు కమల్ ప్రకటించారు. ఈ స్థానంలో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులతో కమల్ పోటీ పడనున్నారు. పొత్తుల్లో భాగంగా డీఎంకే కూటమి నుంచి కాంగ్రెస్‌కు, అన్నాడీఎంకే కూటమి నుంచి బీజేపీకి ఈ స్థానం దక్కింది. ఎంఎన్‌ఎం తొలి విడతలో 70 మంది అభ్యర్థులతో జాబితా విడుదల కూడా చేసింది. శుక్రవారం 42 మంది కూడిన రెండో జాబితాను వెల్లడించింది. దీంతో ఆ పార్టీ నుంచి పోటీచేసే అభ్యర్థుల సంఖ్య 112కి చేరింది.
అయితే ఎన్నికల అఫిడవిట్ లో కమల్ హాసన్ అనేక ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. ఆస్తులు, విద్యార్హతలు వెల్లడించారు. కమల్ హాసన్ మొత్తం ఆస్తుల విలువ ఎంతో తెలుసా.. 177 కోట్ల రూపాయలు. ఇందులో 131 కోట్లు స్థిరాస్తులు కాగా.. మరో 46 కోట్ల చరాస్తులు కమల్ పేరిట ఉన్నాయి. కమల్ హాసన్ కార్ల విలువ 3.69 కోట్ల రూపాయలట. 2019-20 సంవత్సరానికి కమల్ హాసన్ 22 కోట్ల రూపాయల ఐటీ పన్ను కట్టాడట. ఇక కమల్ హాసన్ అప్పుల విషయానికి వస్తే.. అవి 50 కోట్ల వరకూ ఉన్నాయట. మరో ఇంట్రస్టింగ్ టాపిక్ ఏంటంటే.. కమల్ హాసన్ చదివింది 8 వ తరగతి మాత్రమేనట.