ఇక ప్రధానమంత్రిగా రాహూల్ గాంధీ : తేల్చేసిన సోనియాగాంధి

ఇక నుంచి మన దేశ ప్రధాని రాహూల్ గాంధీ అని సోనియాగాంధి తేల్చేసింది. ఈమేరకు పార్టీకి, ప్రభుత్వంలోని మిత్రపక్షాలకు సూరజ్ కుండ్ మేథోమథనం లో స్పష్టం చేసింది. రాజ్యాంగ బద్దంగా సీట్లో మన్మోహన్ సింగ్ కూర్చున్నా ఆయన పనులు మాత్రం రాహూల్ గాంధీ చెప్పినవే చేయాలని తీర్మానించేసారు. దీంతో మంత్రివర్గంలోకి రాహూల్ ఎందుకు రాలేదో అందరికి అర్థమైంది. ఎన్నికలే లక్ష్యంగా జరిగిన కాంగ్రేస్ మేథోమథనం ఎట్టకేలకు ప్రజలకు పార్టీ దూరమవుతోందని గమనించారు. దీనికి మార్గాన్ని కనుగొన్నారు. ఇక నుంచి ప్రభుత్వం పార్టీ చెప్పినట్లుగా నడుచుకోవాలని నిర్ణయించారు. మంత్రులు సైతం పార్టి చెప్పిన పనులే చేయాలని ఆదేశించారు. దీని కోసం ఒక ప్రధాన సమన్వయకమిటి, మరో మూడు ఉప కమిటీలు నియమించారు. ఈకమిటీలకు హోల్ బాస్ గా రాహూల్ గాంధీని నియమించారు. అంటే ఇక నుంచి రాహూల్ చెప్పిందే ప్రభుత్వం చేస్తుంది. సీట్లలో రాజ్యాంగబద్దంగా కూర్చున్న ప్రభుత్వప్రతినిధులంతా ఉత్సవ విగ్రహాలేనన్న మాట. అంటే దేశాన్ని ఇక నుంచి రాహూల్ ముందుకు తీసుకుపోతారు.... కాదుకాదు ప్రభుత్వ పనులతో పార్టీని ముందుకు తోస్తారన్న మాట. అంటే రాహూల్ గాంధీనే మన ప్రధాని అన్నట్టే కదా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: