పురందేశ్వరికి ప్రమోషన్; కావూరిని లైట్ గా తీసుకున్న కాంగ్రెస్

హైదరాబాద్: కేంద్రమంత్రి పురందేశ్వరీ తన పట్టును నిరూపించుకున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ ఏలూరు ఎంపీ కావూరి సాంబశివరావు కంటే పురుందేశ్వరికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తోంది. కావూరి రాజీనామాస్ర్తంతో గత ఆదివారం నాడు సహాయ మంత్రి నుంచి స్వతంత్ర మంత్రిగా ప్రమాణం చేయాల్సి ఉండగా చేయలేదు. కానీ, ఎట్టకేలకు కాంగ్రెస్ హైకమాండ్...ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ఇద్దరూ పురందేశ్వరీ వైపే మొగ్గును కనబర్చారు. పురుందేశ్వరీకి ప్రమోషన్ రాకుండా కావూరి అడ్డు తగిలారనీ ప్రచారం జరిగింది. ఇప్పటి వరకు కూడా కావూరి తన రాజీనామా విషయమై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయినప్పటికీ కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం పురుందేశ్వరీకి పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటోంది. పురందేశ్వరికి స్వతంత్ర హోదాలో జౌళిశాఖను కేటాయించారనీ జోరుగా ప్రచారం జరుగుతోంది.  పురుందేశ్వరి కంటే కావూరి సాంబశివరావు ఎంతో సీనియర్ నేత. కోస్తాంధ్రలో బలమైన నాయకుడు. రెండు దశాబ్దాలకు పైగా పార్లమెంటుకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే, గత ఆదివారం నిర్వహించిన కేంద్ర కేబినెట్ లో తనకు అవకాశం కల్పించకపోవడం, తనకంటే జూనియర్లను కేబినెట్ లోకి తీసుకోవడం, ముఖ్యంగా పురందేశ్వరికీ ప్రమోషన్ ఇస్తున్నట్లు మీడియాలో వచ్చిన వార్తలతో తీవ్ర కలత చెందిన కావూరి తన రాజీనామా లేఖను స్పీకర్కు ఫ్యాక్సు చేసినట్లు వార్తలొచ్చాయి. కావూరి అలకపై ఇప్పటి వరకు కాంగ్రెస్ హైకమాండ్ స్పందించలేదు. సాక్షాతు ప్రధానమంత్రే పురుందేశ్వరికి ఫోన్ చేసి ప్రమోషన్ ఇస్తున్నట్లు చెప్పడం....తరువాత కావూరి రాజీనామా చేయడంతో ప్రమోషన్ ఆగిపోయింది.  దీనిపై పురుందేశ్వరికి కూడా కొంత అసంత్రుప్తికి గురయ్యారు. ఎట్టకేలకు కాంగ్రెస్ హైకమాండ్, ప్రధానమంత్రి పురుందేశ్వరికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలనీ అనుకుని ప్రమోషన్ కలిపించే విషయమై నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కావూరి ఎలాగూ రాజీనామా చేశారు, కేబినెట్ లో మంచి పేరు తెచ్చుకున్న పురందేశ్వరీని ఎందుకు దూరం చేసుకోవాలనీ అనుకుందేమో కాంగ్రెస్ పురుందేశ్వరికి ప్రమోషన్ ఇచ్చింది. పురుందేశ్వరికి ఎట్టకేలకు ప్రమోషన్ ఇవ్వడంతోనే ఎంతో సీనియర్ అయిన కావూర్ని మాత్రం కాంగ్రెస్ లైట్ గా తీసుకుందనీ కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఎన్నో ఏళ్లుగా పార్టీకి సేవలు చేస్తున్న తనను లైట్ గా తీసుకుంటున్నప్పటికీ...కావూరి ఇప్పటి వరకు నోరు మెదపడం లేదు. కావూరి వద్దని వారించినా పురుందేశ్వరికీ ప్రమోషన్ కలిపించడంతో కాంగ్రెస్ పార్టీ కావూర్ని పెద్దగా పట్టించుకోవడం లేదనీ తేలిపోయింది. ఇప్పుడు కావూరి ఏం చేస్తారో చూడాలి మరి. ఇప్పటి వరకు వాణిజ్యశాఖ సహాయమంత్రిగా పురందేశ్వరి బాధ్యతలు నిర్వర్తించిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: