ముగ్గురు పిల్లల తల్లి.. 15 ఏళ్ల బాలుడు.. చివరికి ఏం జరిగిందంటే..?

praveen
ఈ మధ్య కాలంలో మానవ సంబంధాలకు అసలు విలువ లేకుండా పోతుంది అన్న విషయం తెలిసిందే. క్షణకాల సుఖం కోసం ఎన్నో దారుణాలకు పాల్పడుతున్నారు మనుషులు. బంధాలకు బంధుత్వాలకే  కాదు వయసుకు  కూడా విలువ ఇవ్వడం లేదు.  రోజు రోజుకు తెర  మీదకి వస్తున్న ఘటనలతో సభ్య సమాజం మొత్తం తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  ఏకంగా క్షణకాల సుఖం కోసం కట్టుకున్న వారిని మోసం చేస్తూ పరాయి వ్యక్తుల మోజులో పడి చివరికి దారుణాలకు పాల్పడుతున్నారు.


 ఇక్కడ ఇలాంటి తరహా దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ముగ్గురు పిల్లలు ఉన్న ఓ మహిళ ఏకంగా 15 ఏళ్ల బాలుడు తో పారిపోయిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గోరక్ పూర్ లో చోటుచేసుకుంది. గోరక్ పూర్ సమీపంలోని కంపియ గంజా కు చెందిన ఓ వివాహితకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే అదే ప్రాంతానికి చెందిన ఏడో తరగతి చదువుతున్న 15 ఏళ్ల బాలుడు ఇక ఆ మహిళ ఇంటికి తరచూ వస్తూ ఉండేవాడు. ఈ క్రమంలోనే ఆ బాలుడి పై కన్నేసిన మహిళ అతడితో పరిచయం పెంచుకుంది..  మాయమాటలు చెప్పి  కామ కోరికలు తీర్చుకుంటూ ఉండేది.



 ఈ క్రమంలోనే ఇక ఎవరూ వద్దు ఆ మైనర్ బాలుడు ఉంటే చాలు అనుకుంది సదరు మహిళ. ఇక ఇటీవల ఇంట్లో ఎవరూ లేని సమయంలో.. బాలుడిని తీసుకుని పరార్ అయింది.  అయితే బాలుడు కనిపించకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు.. ఈ విషయం బయటకి పొక్కకుండా కుర్రాడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆచూకీ లభించకపోవడంతో చేసేదేమీ లేక పోలీసులను ఆశ్రయించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం ఇక పారిపోయిన వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: