కర్నాటక రాసలీలల కేసు.. రష్యాతో లింకు..
ఎవరీ శ్రవణ్..?
రాసలీలల సీడీలను ఎవరు, ఎక్కడ రూపొందించారు, సూత్రధారు లెవరు అనే విషయంపై సిట్ ప్రధానంగా దృష్టిసారించింది. దీనికోసం కర్నాటక రాష్ట్ర వ్యాప్తంగా పలువురు అనుమానితుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు పోలీసులు. బెంగళూరు రూరల్ పరిధిలోని విజయపుర పట్టణంలో ఉన్న బసవేశ్వర లేఔట్‌లో నివాసం ఉంటున్న సురేష్ శ్రవణ్ అలియాస్ పెయింటర్ సూరి ఇంటికి మూడు వాహనాల్లో పోలీసులు చేరుకుని సోదాలు చేశారు. కొన్ని సీడీలు, కంప్యూటర్ సీజ్ చేశారు. శ్రవణ్ గది మొత్తాన్ని తనిఖీ చేశారు. వారం రోజుల నుంచి శ్రవణ్ ఇంటికి రాకపోవడంలేదని తెలుసుకున్న పోలీసులు.. అతని సోదరుడిని తీసుకెళ్లి విచారణ చేపట్టారు. రాసలీలల సీడీని శ్రవణ్ తనే స్వయంగా తన కంప్యూటర్ లో ఎడిటింగ్ చేయడంతో పాటు యూట్యూబ్ లో అప్ లోడ్ చేశాడని పోలీసులు చెబుతున్నారు.
శ్రవణ కంప్యూటర్ ఓపెన్ కాకపోవడంతో దానినితో పాటు పలు సీడీలను, పెన్ డ్రైవ్ లను పోలీసులు తీసుకెళ్లారు. సీడీల రూపకల్పనకు సూత్రధారిగా ఆరోపణలున్న నరేష్ గౌడ అనే వ్యక్తి ఇంట్లో కూడా పోలీసులు సోదాలు చేశారు. ఇంత జరుగుతున్నాసీడీలో కనిపించిన యువతి ఆచూకీ ఇప్పటి వరకూ లభ్యం కాలేదు. అయితే ఆమె సోషల్ మీడియాలో ఓ వీడియో విడుదల చేయడం విశేషం. ఇప్పటి వరకు అజ్ఞాతంలో ఉన్న ఆమె శనివారం రాత్రి తాను మాట్లాడిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మాజీ మంత్రి రమేశ్ జార్కిహొళి తనకు ఉద్యోగం ఇప్పిస్తానని మాట ఇచ్చి తప్పాడని, పైగా ఆయనే సీడీని బయటకు విడుదల చేశారని ఆరోపించింది. వీడియోను ఎవరు, ఎలా చిత్రీకరించారో తనకు తెలియదని పేర్కొంది. తాను పలుమార్లు ఆత్మహత్యా ప్రయత్నం చేసినట్టు చెప్పింది బాధితురాలు.
మరోవైపు రాసలీలల సీడీపై రమేశ్ జార్కిహొళి శనివారం బెంగళూరు సదాశివనగర పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తనపై జరిగిన రాజకీయ కుట్రగా ఆ ఘటనను అభివర్ణించారు. నకిలీ సీడీని సృష్టించి తనను మానసికంగా హింసించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.