ఆమ్లెట్ కోసం ప్రాణాలను తీసిన దుర్మార్గుడు..చివరికి

Satvika
భార్య భర్తల మధ్య గొడవలు రావడం సహజం.. అయితే ఆ గొడవలు అయినప్పుడు ఎవరో ఒకరు తగ్గితే బాగుంటుంది. లేదంటే ఆ గొడవలు కాస్త ఎక్కువగానే అవుతాయి. దాంతో జీవితాలు నాశనం అవుతాయి. కుటుంబాలు చిన్నా భిన్నం అవుతాయి. చిన్న చిన్న వాటికి గొడవలు రావడం సహజం. అవి ప్రాణాలు తీసుకొనే వరకు పోకూడదు. ఇప్పుడు జరిగిన ఓ ఘటన దారుణం అనే చెప్పాలి. అడిగింది చేయలేదని భార్యను అతి కిరాతకంగా చంపాడు ఓ భర్త ..

శివరాత్రి పండుగ నాన్ వెజ్ వద్దందని భార్య వాదించిందని కోపంతో ఊగిపోయిన భర్త భార్యను చంపేశాడు.వివరాల్లోకి వెళితే..పండగ పూట ఆమ్లెట్‌ వద్దన్నందుకు భార్యను చంపి భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన జిల్లాలోని ఆతానూర్‌ మండలం ఉమ్రి(కే) గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గంగాధరోల్ల యోగేశ్  భార్య ఆమ్లెట్‌ వేయలేదని ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్‌ఐ గుడిపెల్లి రాజన్న తెలిపిన వివరాల ప్రకారం.. యోగేశ్‌ నాలుగేండ్లుగా తాగుడుకు బానిసయ్యాడు. గురువారం సాయంత్రం కూడా మద్యం తాగి ఇంటికి వచ్చాడు.

అన్నం తినడానికి ఆమ్లెట్‌ వేయమని భార్యను అడిగాడు. శివరాత్రి పండుగ ఉందని, వద్దని ఆమె వారించింది. దీంతో భార్యను కొట్టడంతో ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్లింది. మళ్లీ ఇంటికి వచ్చిన ఆమెపై అమానుషంగా ప్రవర్తించారు. అతి కిరాతకంగా చంపేశాడు. ఆ తర్వాత యోగేశ్‌ ఇంట్లోనే తాగిన మైకంలో నైలాన్‌ తాడుతో దూలానికి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు..భార్య భాగ్యశ్రీ కుటుంబ సభ్యులు వచ్చి చూసే సరికి విగతజీవిగా కనిపించాడు. కాగా యోగేశ్‌కు కొడుకు, కూతురు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.. ఇద్దరు చనిపోవడం తో పిల్లలు అనాథలుగా మారారు.. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. కోపం మనిషిని ఎంతటికైన తెగించెలా చేస్తుంది. కోపాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తే అంతా బాగుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: